జగన్ ఆ పేర్లెందుకు చెప్పరు?

కాగా, సోనియా గాంధీ పేరును పక్కను పెడితే ఇందిరా గాంధీ పేరును గానీ రాజీవ్ గాంధీ పేరును గానీ జగన్ ప్రస్తావించడం లేదు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ పథకాలన్నింటికీ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు పెట్టారు. శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టిన సోనియా చేతుల మీదుగా దాన్ని ప్రారంభింపజేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రసంగాల్లో తప్పకుండా సోనియా పేరు, ప్రధాని మన్మోహన్ పేర్లు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ తన తండ్రివేనన్నట్లుగా ఆయన ప్రచారం సాగిస్తున్నారు. తండ్రి ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తావిస్తున్న ఆ పథకాల పేర్లను చెప్పడం లేదు. దీన్ని బట్టి జగన్ కు కాంగ్రెసు దాటిన ఆలోచనలున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇటీవల జెండా ఆవిష్కరణ చేయాల్సి వచ్చినప్పుడు కాంగ్రెసు గుర్తు లేని జెండాను ఆవిష్కరించారు. ఇలా కాంగ్రెసు నుంచి తన ఓదార్పు యాత్రను వేరు చేసుకుంటున్నారు. తన ఓదార్పు యాత్ర ద్వారా లభించే ఫలితాన్ని పార్టీకి దక్కకుండా చేస్తున్నారు. అంటే, ఓదార్పు యాత్ర ద్వారా తన వ్యక్తిగత బలాన్ని, ప్రజాదరణను సంపాందించుకుని, దాని ద్వారా పార్టీ అధిష్టానాన్ని తన దారికి తెచ్చుకోవాలనేది ఆయన మొదటి ఆలోచన కావచ్చు. రెండో ఆలోచన - అవసరమైతే సొంత పార్టీ పెట్టడం అయి ఉంటుంది.












Click it and Unblock the Notifications