వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తారుమారు: చిరుకు ఊరట, జగన్‌కు చిక్కులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-YS Jagan
రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల్లో ఇమేజ్ ఉన్న ఇద్దరు నాయకుల పాత్రలు తారుమారయ్యాయి. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో చల్ల కదలకుండా వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ ముందుకు సాగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లో పడగా, ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి కాంగ్రెసు నేతగా అవతరించిన చిరంజీవికి శరీర కష్టం తప్పింది. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత చిరంజీవి చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తున్నారు. పెద్ద బరువు దిగిన భావనకు గురవుతున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమాలకు హాజరవుతున్నారు.

అంతకు ముందు కౌలు రైతుల సమస్యలపై, దానికి ముందు సమైక్యాంధ్రపై చిరంజీవి కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. ఏ సమస్య వచ్చినా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. మరో వైపు, ఇటు నాయకులు, అటు కార్యకర్తలు చేజారిపోకుండా చూసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. పార్టీని పటిష్టపరచాల్సిన అనివార్యతలో చిక్కుకున్నారు. దీంతో ఆయనకు క్షణం తీరిక లేకుండా పోయింది. ఒక రకంగా వాటితో చిరంజీవి విసిగిపోయారు. పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత రాజకీయాల్లో అతిథి పాత్ర పోషిస్తే సరిపోయే పరిస్థితి వచ్చింది.

వైయస్ జగన్ వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తూ చెమటోడుస్తున్నారు. కడుపులో చల్ల కదలకుండా వ్యవహారాలను చక్కబెట్టుకునే స్థితి నుంచి ఎండనక, వాననక ఊళ్లు పట్టి తిరగాల్సి వస్తోంది. ప్రజా సమస్యలపైనే కాకుండా తన పార్టీని వచ్చే ఎన్నికల్లోనైనా అధికారంలోకి రావడానికి జగన్ నిత్యం ప్రజల్లో ఉండాల్సి వస్తోంది. ఓదార్పు యాత్రను ఎడ తెగకుండా సాగించాల్సి వస్తోంది. మరో వైపు సాధ్యమైనంత ఎక్కువ మంది శాసనసభ్యులను కూడగట్టుకోవాల్సి వస్తోంది, ఉన్నవారు జారిపోకుండా చూసుకోవాల్సి వస్తోంది. వీటన్నింటికి తోడు సిబిఐ దర్యాప్తు పిడుగులా వచ్చి తల మీద పడింది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల విమర్శలను, ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

English summary
In AP politics roles of YS Jagan and Chiranjeevi reversed. While Chiranjeevi is in happy mood, YS Jagan is in trouble.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X