సోనియా హామీతో 'చిరు' ఉత్సాహం

Chiranjeevi
కాంగ్రెసులోని ప్రజారాజ్యం పార్టీ క్యాడర్‌లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవితో భేటీ కావడం, చిరుతో పాటు ఆయన వర్గం నేతలకు పదవులపై హామీ ఇవ్వడం ఆ వర్గంలో అనందం కనిపిస్తోంది. పరిస్థితుల అనుకూలతను బట్టి ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో, స్థానిక నేతలకు పిసిసి, డిసిసిల్లో పదవులు లభించే అవకాశముంది. మంచిరోజులు రాకపోతాయా అంటూ ఇప్పటివరకూ ఆయనతో ఉన్న నేతలు ఎవరి లెక్కల్లో వారు పడ్డారు. రాష్ట్రంలో మంత్రివర్గాన్ని విస్తరిస్తే రెండు మంత్రి పదవులు, ప్రభుత్వ విప్ తమకు దక్కుతాయన్న అంచనాతో ఆవర్గాలున్నాయి.

అయితే, మంత్రి పదవులపై కాంగ్రెస్ పెట్టుకున్న నియమాన్ని తమ విషయంలోనూ సడలిస్తారా? అన్న సందిగ్ధంలోనూ వారు ఉన్నట్లుగా కనిపిస్తోంది. పాత విధానాన్నే కొనసాగిస్తే ఎమ్మెల్సీ రామచంద్రయ్య, మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రమే అవకాశం ఉంటుంది. కొత్త ఎమ్మెల్యేలకు తెలంగాణ, బీసీ కోటాల్లో పదవి ఆశిస్తున్న అనిల్‌కు ఆశాభంగం తప్పదు. మరోవైపు ఆయన జిల్లాకే చెందిన పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ అవడం మంత్రి పదవి రేసులో ఆయనా ఉండటం సమస్యగా మారింది. కష్టకాలంలో పార్టీని విలీనం చేసి అండగా నిలబడినందున ఆ నిబంధన తమకు వర్తించకపోవచ్చునని కొత్తగా ఎన్నికైనవారు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచీ చిరంజీవితో సాన్నిహిత్యం ఉన్న కన్నబాబు కూడా తన వంతు ప్రయత్నం చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో మహేశ్వర్ రెడ్డి కూడా ఆశతోనే ఉన్నారు. అయితే సీనియర్లు రామచంద్రయ్య, గంటా ప్రధానంగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తన స్థాయికి తగిన హోదా కల్పిస్తామంటూ సోనియా చెప్పినట్లు చిరంజీవి వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాబోయే పదవిని బట్టి పార్టీలో ఆయన హోదా ఏమిటో తేలుతుందన్న సంకేతం ప్రజల్లోకి వెళ్లిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+