తెలంగాణ ఎంపిల ప్రకటనపై అధిష్టానం ఆరా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే చిత్తశుద్ధితోనే వారు రెచ్చిపోయి మాట్లాడుతున్నారా, లేదంటే వారికి ఏదైనా రహస్య ఎజెండా ఉందా అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైపు వెళ్తారనే ప్రచారం ముమ్మరంగానే సాగుతోంది. నల్లగొండ జిల్లాకు చెందిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటి కాంగ్రెసు సీనియర్ నాయకులు కోమటిరెడ్డి సోదరులపై అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సాకుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వారు సమరం సాగిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీనియర్ మంత్రి కె. జానారెడ్డి వంటి వారు ముఖ్యమంత్రికి చెమటలు పట్టించడమే పనిగా తెలంగాణ ఎజెండాను వాడుకుంటున్నారని అంటున్నారు. జానా రెడ్డి ముఖ్యమంత్రి పదవిని ఆశించి అలా ప్రవర్తిస్తున్నారనే ఉద్దేశంతో అధిష్టానం ఉందని చెబుతున్నారు. అది గమనించి అధిష్టానం పెద్దలు ఆయనకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే ఆయన తెలంగాణపై ఇటీవల పెద్దగా మాట్లాడడం లేదని చెబుతున్నారు.
ఇతరేతర ఎజెండాలతో తెలంగాణ డిమాండును కొంత మంది అడ్డుపెట్టుకుంటున్నట్లు అధిష్టానం గుర్తించిందని అంటున్నారు. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్డడం లేదు. కేశవరావు ఎజెండా ఏమిటనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో గానీ వైయస్ జగన్మోహన్ రెడ్డితో గానీ వారు ఏమైనా అవగాహనకు వచ్చారా అనే విషయంపై కూడా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది.












Click it and Unblock the Notifications