వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణతో కాంగ్రెసు పెద్దల బంతాట

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-P Chidambaram
తెలంగాణ బంతితో కాంగ్రెసు పెద్దలు బంతాట ఆడుతున్నారు. కేంద్రం తెలంగాణ బంతిని రాష్ట్రానికి కొడితే, రాష్ట్ర నాయకత్వం కేంద్రం వైపు కొడుతోంది. తెలంగాణ ఓ బంతిలాగా ఢిల్లీకి, హైదరాబాదుకు మధ్య ఆడుతోంది. దాని దెబ్బకు తెలంగాణలో మాత్రం ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణ సమస్యను పార్టీ అధిష్టానం పరిష్కరిస్తుందని, ఇందుకు గాను చర్చలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. ఆ మాటలు చెప్పి విధులకు హాజరు కావాలని తెలంగాణ మంత్రులకు సూచిస్తున్నారు.

కేంద్ర హోం మంత్రి మాత్రం తెలంగాణ సమస్యను రాష్ట్రంలోనే పరిష్కరించుకోవాలని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లో ఏకాభిప్రాయం లేదని, రాష్ట్రంలో పార్టీలు ఆ ఏకాభిప్రాయాన్ని సాధించాలని ఆయన అంటున్నారు. చిదంబరం పాటనే విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి తోడు కాంగ్రెసు పెద్దలు తెలంగాణతో ఆడుకోవడానికి కొత్తగా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా దొరికింది. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు నాయకత్వాలు అంగీకరిస్తే తప్ప తెలంగాణ సాధ్యం కాదని, రాష్ట్రంలోని మెజారిటీ శాసనసభ్యులు రాష్ట్ర విభజనకు అంగీకరించాలని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు అంటున్నారు.

తెలంగాణ అంశాన్ని పరిష్కరించే ఉద్దేశం గానీ, తెలంగాణకు వ్యతిరేకంగానో సానుకూలంగానో స్పష్టమైన వైఖరి ప్రకటించే సాహసం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెసు గానీ చేయడం లేదు. దీంతో తెలంగాణ అంశం రావణకాష్టంలా మండుతూనే ఉన్నది. ఇది ఎన్నాళ్లు మండినా ఫరవాలేదని, తమ పార్టీ తామూ చక్కగా దేశాన్నీ రాష్ట్రాన్నీ ఏలితే చాలునని కాంగ్రెసు పెద్దలు భావిస్తున్నారు. ప్రజలు ఎటు పోయినా ఫరవా లేదు, తాము అధికారంలో ఉంటే చాలుననే వైఖరిని అవలంబిస్తున్నారు.

English summary
Congress high command is playing with Telangana issue like ball. union home minister P chidambaram statement indicates this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X