చంద్రబాబుపై మచ్చ తొలగిందా?

Chandrababu Naidu
కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారనే మచ్చను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తొలగించుకున్నారా అనే అనుమానం కలుగుతోంది. కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదించడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విమర్శను ఎదుర్కోవడానికి చంద్రబాబు ప్రయత్నం ఫలించలేదనే మాట వినిపిస్తోంది. జగన్ విమర్శను ఎదుర్కోవడానికి తాను కాంగ్రెసుతో కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవడానికి చంద్రబాబు తన పార్టీ శాసనసభ్యులతో హడావిడి చేసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇప్పించారు. కానీ, దాన్ని శాసనసభ స్పీకర్ పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఆ తీర్మానం నోటీసు తన దృష్టికే రాలేదని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అంటున్నారు.

చంద్రబాబు విషయాన్ని అటుంచితే మనోహర్ మాటలను నమ్మే పరిస్థితి లేదు. మామూలు ప్రజలు కూడా మనోహర్ మాటలను విశ్వసించరనే విషయాన్ని కచ్చితంగా చెప్పవచ్చు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి ఇష్టం లేకపోవడం వల్ల స్పీకర్ ఆ విధంగా మాట్లాడుతున్నారని ఎవరైనా భావిస్తారు. అయితే, తమ అవిశ్వాస తీర్మానం నోటీసును పరిగణనలోకి తీసుకోకపోవడంపై తెలుగుదేశం నాయకులు ప్రభుత్వాన్ని, స్పీకర్‌ను తప్పు పడుతున్నారు. అవిశ్వాస తీర్మానం ఇప్పట్లో శాసనసభలో చర్చకు రాదనే విషయం అందరికీ అర్థమైపోయింది. వర్షాకాలం సమావేశాల్లోనైనా అది చర్చకు వస్తుందా అనేది చంద్రబాబు వైఖరి మీదనే ఆధారుపడి ఉంటుంది.

అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చి తనపై వచ్చిన నిందను తొలగించుకున్నట్లు బహుశా చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చు. కానీ, అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి, ప్రభుత్వాన్ని కూల్చి, మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవడం చంద్రబాబుకు ఇష్టం లేదనే విషయం ఎవరిని అడిగినా చెబుతారు. కేవలం జగన్ వేసిన నిందను తొలగించడానికి మాత్రమే అవిశ్వాస తీర్మానం నోటీసు డ్రామా ఆడారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యల్లో ఏదో మేరకు నిజం లేకపోలేదు.

మొత్తం మీద, చంద్రబాబు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నోటీసు ఓ ప్రహసనం మాదిరిగానే మిగిలిపోయింది. కాకపోతే, వైయస్సార్ కాంగ్రెసు నేత వైయస్ జగన్‌కు కొంత పని కల్పించడానికి ఉపయోగపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+