వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయా ప్రతిపాదన తెలంగాణకు దెబ్బ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Mayawati
శానససభ ఎన్నికల స్టంట్‌గానే భావిస్తున్నా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేయాలనే ప్రతిపాదన తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సిన సమయంలో మాయావతి ఉత్తరప్రదేశ్ విభజనను ముందుకు తెచ్చి ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు తెలుపుతున్న బిజెపి మాయావతి ప్రతిపాదనను మాత్రం వ్యతిరేకిస్తోంది. దీంతో బిజెపి ద్వంద్వ వైఖరి బయటపడుతుందని మాయావతి భావించి ఉండవచ్చు గానీ ఉత్తరప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ తెలంగాణ ఇస్తామంటే, తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదిస్తే మద్దతిస్తామని చెప్తే నమ్మడానికి వీలవుతుందా అనే ప్రశ్న ముందుకు వస్తోంది. తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యవాదులు దాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు.

బిజెపి వ్యవహారాన్ని పక్కన పెడితే, యుపి విభజన ముందుకు రావడం వల్ల తెలంగాణపై రెండో ఎస్సార్సీని వేయాల్సిన అనివార్యతలో కేంద్ర ప్రభుత్వం పడుతుందని ఆంధ్రప్రదేశ్‌లోని సీమాంధ్ర నాయకులు అంటున్నారు. మాయావతి ప్రతిపాదన తెలంగాణకు ఆటంకంగా మారుతుందని వారంటున్నారు. జాతీయ స్థాయిలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై, రాష్ట్రాల విభజనపై కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సి వస్తుందని, దాని వల్ల తెలంగాణపై కూడా ఆ జాతీయ స్థాయి వైఖరికి అనుగుణంగానే వ్యవహరించాల్సి వస్తుందని, జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రెండో ఎస్సార్సీని వేస్తుందని అంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఇప్పట్లో వీలు కాదని, రెండో ఎస్సార్సీ నిర్ణయం తర్వాత, దాని నివేదిక ఆధారంగానే తెలంగాణపై తమ వైఖరిని నిర్ణయించుకోవచ్చునని సీమాంధ్ర నాయకులు భావిస్తున్నారు. ఈలోగా 2014 ఎన్నికలు వస్తాయని అంటున్నారు.

అయితే, తెలంగాణ వాదుల వాదన అందుకు భిన్నంగా ఉంది. యుపి విభజనపై మాయావతి నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా పనిచేస్తుందని వారంటున్నారు. మొత్తంగానే విభజన అనేది జాతీయ ఎజెండాగా ముందుకు వచ్చినప్పుడు తెలంగాణ అంశాన్ని ముందు పరిష్కరించాల్సి వస్తుందని వారంటున్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ అవసరం లేదని, భారత తొలి ప్రధాని నెహ్రూ మాటల ఆధారంగా తెలంగాణకు విడిపోవడానికి వీలుంటుందని వీరంటున్నారు. కలిసి జీవించడానికి వీలు కాదని భావించినప్పుడు తెలంగాణవాళ్లు విడిపోవచ్చునని నెహ్రూ అన్నారు. పైగా, తెలంగాణ రాష్ట్రం అనేది పునరుద్ధరణే తప్ప ఆంధ్రప్రదేశ్ విభజన కాదని తెలంగాణవాదులు అంటున్నారు.

English summary
There is an argument that, UP CM Mayawati proposal to split UP into four states may hit Telangana state formation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X