బాబు ఎన్టీఆర్ నుండి రక్షించాడా?

కానీ హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు పొందిన చంద్రబాబునాయుడు మాత్రం మూడు ఎన్నికలు ఎదుర్కొని కేవలం ఒక్క ఎన్నికలో మాత్రమే విజయం సాధించాడు. 2004, 2009లో చంద్రబాబు నేతృత్వంలో పార్టీ ఘోర పరాజయాలను పొందింది. కేవలం 1999లో మాత్రమే చంద్రబాబు పార్టీని గెలుపు దిశగా పయనింప జేశారు. అయితే అది చంద్రబాబు మేథ కాదని పలువురు వాదన. లక్ష్మీపార్వతి తదితరులు కూడా 1999 గెలుపు చంద్రబాబు చలువ కాదని చెబుతున్నారు. అప్పుడు చంద్రబాబు కేంద్రంలో అప్పటికే అధికారంలో ఉన్న బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. నాడు బిజెపి ప్రభుత్వంపై ఉన్న సానుభూతి, మచ్చలేని వాజపేయిపై ఓటర్లకు ఉన్న విశ్వాసం తదితర అంశాలు చంద్రబాబు గెలుపుకు ఖాయమయ్యాయని విమర్శకుల వాదన. అంతేకాదు అప్పటికి ఎన్టీఆర్ మృతి చెందటంతో తెలుగుదేశం పార్టీ - ఎన్టీఆర్‌ను ప్రజలు వేరుగా చూడ లేక పోయారు. ఎన్టీఆర్ బ్రతికి ఉండి చంద్రబాబు పరిస్థితి వేరుగా ఉండేదని పలువురి వాదన.
దాదాపు పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికలలోనూ ఓటమి చెందాడు. అపర చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు మేథ రెండు ఎన్నికలలోనూ పని చేయలేక పోయింది. ఎన్టీఆర్ మైనార్టీలను, మెజార్టీలను, రైతులను, ఉద్యోగులను, రైతులను అందరినీ కలుపుకొని పోయి నాలుగు ఎన్నికలలో మూడు విజయాలు సాధించగా, చంద్రబాబు మాత్రం అందుకు విరుద్దంగా తన హయాంలో వారందరికీ వ్యతిరేకిగా మారు మూడింటిలో ఒక్క విజయాన్ని అదీ బిజెపి అండతో గట్టెక్కారు. ఎన్టీఆర్ హయాంలో అల్పసంఖ్యాక వర్గాలు టిడిపికి అండగా ఉండేవి. అయితే చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకోవడం కారణంగా వారు దూరమయ్యారు. వ్యవసాయం దండగ అని చెప్పి రైతులను, నేను నిద్రపోను మిమ్మల్ని నిద్ర పోనివ్వనని ఉద్యోగులలో అసంతృప్తికి కారణమైన చంద్రబాబు వారిని దూరం చేసుకొని రెండుసార్లు అధికారానికి దూరం అయ్యాడు. ఇప్పటి వరకు వారి అండను పోగు చేసుకోలేని చంద్రబాబు ఎన్టీఆర్ చేతి నుండి పార్టీ పగ్గాలు తీసుకొని పార్టీని రక్షించినట్టు ఎలా అవుతుందనేది పలువురి వాదన.












Click it and Unblock the Notifications