వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ముందు చూపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
ఓ వైపు తన ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తు జరుగుతున్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం ముందు చూపుతో వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా ఎవరైనా టిక్కెట్లు ఇచ్చే విషయంలో ఎన్నికలకు కాస్త ముందు నిర్ణయం తీసుకుంటారు. కానీ జగన్ పక్కా వ్యూహంతో ఇప్పటి నుండే పార్టీ అభ్యర్థులను నిర్ణయించే పనిలో పడ్డారట. అధికారికంగా వెలువడనప్పటికీ ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులను జగన్ ప్రకటించారట. ఓ వైపు విచారణ, మరోవైపు ఓదార్పు యాత్ర చేస్తూనే ఇంకోవైపు పార్టీ సంస్థాగత అభివృద్ధిపై దృష్టి సారిస్తూ వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులను సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు జగన్‌తో ఉన్న ముప్పై మంది ఎమ్మెల్యేల్లో అనుకోని పరిణామాలు ఎదురైతే తప్ప దాదాపు వారికి టిక్కెట్లు ఖరారైనట్టే. మిగిలిన వారికి పార్టీ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు.

రోజాకు నగరి, అనంతలో ఫయాజ్, ధర్మవరంలో చంద్రశేఖర్ ఇలా పలుచోట్ల దాదాపు అభ్యర్థులను జగన్ ఖరారు చేశారట. అనంతపురంలో పుట్టపర్తి, మడకశిర, హిందూపూర్, రాప్తాడు, కళ్యాణదుర్గం, కదిరి, కడపలో ప్రొద్దుటూరు, కమలాపూరం, మైదుకూరులో అభ్యర్థులు ఖరారైనట్లుగా సమాచారం. విశాఖ, గుంటూరు అధికారికంగా ప్రకటించనప్పటికీ దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. చిత్తూరులో చంద్రగిరి, చిత్తూరు, సత్యవేడు, కుప్పంకు ఖరారైనప్పటికీ శ్రీకాళహస్తి తదితర కొన్ని ప్రాంతాలలో రెండు గ్రూపులు ఉండటంతో వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు జగన్ అడుగుపెట్టనప్పటికీ ఈ ప్రాంతంలోనూ కొందరు ఖరారైనట్లుగా కనిపిస్తోంది.

మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, దేవరకద్ర, కొల్లాపూర్, వనపర్తి, షాద్ నగర్, నారాయణపేట, అదిలాబాద్‌లో బోధన్, ఖమ్మం నుండి కొత్తగూడ, ఇల్లెందు, సత్తుపల్లి, కరీంనగర్ నుండి హుజురాబాద్, హుస్నాబాద్, మెదక్ నుండి గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, పటాన్ చెరు, నర్సాపూర్ తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు అందులోని కొన్ని నియోజకవర్గాల్లో ఖరారు చేసే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. అన్ని పార్టీలు అభ్యర్థులను ఎన్నికల ముందు ప్రకటించనుండగా జగన్ మాత్రం అధికారికంగా అందరినీ ప్రకటించనప్పటికీ చాపకింద నీరులా ఎన్నికల కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. ఇప్పటికే ఓదార్పు యాత్ర వంటి తదితర సందర్భాల్లో పలువురుని వచ్చే ఎన్నికలకు ఆయన అభ్యర్థిగా ప్రకటించారు కూడా.

English summary
It seems, YSR Congress party president YS Jaganmohan Reddy announced his party constituency candidates unofficially.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X