నర్సింహన్‌ను కూడా వదలని నారాయణమూర్తి

Poru Telangana
నటుడు, దర్శకుడు, నిర్మాత తన తాజా సినిమా పోరు తెలంగాణలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కూడా వదిలిపెట్టలేదు. ఆ సినిమా శుక్రవారం విడుదలైంది. డిసెంబర్ 31వ తేదీ తర్వాత జనవరి 1 వస్తుందని గవర్నర్ వ్యాఖ్యానించడం దారుణమని ఆగ్రహావేశాల సంభాషణల్లో నారాయణ మూర్తి పాత్ర ఈ సినిమాలో అంటుంది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే 31వ తేదీ తర్వాత తీవ్ర పరిణామాలుంటాయని అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హెచ్చరించారు. దానిపై ప్రతిస్పందిస్తూ నరసింహన్ డిసెంబర్ 31వ తేదీ తర్వాత జనవరి 1 వస్తుందని తేలికగా మాట్లాడారు. దానిపైనే నారాయణమూర్తి తన సినిమాలో నిప్పులు చెరిగారు.

తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల కాంగ్రెసు నాయకులు సీరియస్‌గా లేరనే విషయాన్ని సినిమాలో నారాయణమూర్తి ప్రధానం చేసుకున్నారు. క్లైమాక్స్‌లో ప్రజలు వారిని వెంటాడి కొడుతారు. చంద్రబాబుపై కూడా ఈ సినిమాలో విసుర్లున్నాయి. నేరుగా చంద్రబాబు పేరు ప్రస్తావించలేదు గానీ ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ అంశంపై రెండు వైఖరులను ప్రదర్సించడాన్ని విమర్శించారు. నిజానికి, నారాయణమూర్తి తెలంగాణకు చెందినవారు కారు, కానీ తెలంగాణకు అనుకూలంగా సినిమా తీశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కోట శ్రీనివాస రావు ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషించారు. తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యల ప్రస్తావన కూడా ఈ సినిమాలో ఉంది.

పోరు తెలంగాణ సినిమాలో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కనిపిస్తారు. అయితే, అది ఫుటేజ్ రూపంలోనే. తెలంగాణ కోసం నిరాహారదీక్ష చేపట్టబోతున్నట్లు కెసిఆర్ చేసిన ప్రకటన దృశ్యం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమాను శుక్రవారం కె. చంద్రశేఖర రావుతో పాటు ఇతర తెరాస నాయకులు చూశారు. అయితే, తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేత స్వామి గౌడ్ అరెస్టుతో కెసిఆర్ సినిమాను పూర్తిగా చూడలేకపోయారు. మధ్యలోనే ఆయన బయటకు వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+