వైయస్ జగన్ సిబిఐ దర్యాప్తును ఎదుర్కోవాల్సిందేనా?

YS Jagan
వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు కలిగి ఉన్నాడన్న పిటిషన్లపై హైకోర్టు ప్రాథమిక స్థాయి విచారణ జరిపించాలని సిఐడిని ఆదేశించిన నేపథ్యంలో పలువురు నేతలు స్పందించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాజ్య సభ సభ్యుడు వి హనుమంతరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు తదితరులు హైకోర్టు తీర్పుపై స్పందించారు. రాష్ట్ర కాంగ్రెసులో తీవ్ర సంక్షోభం సృష్టించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెసు పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ జగన్‌పై అగ్గిమీద గుగ్గిలం అయిన వి హన్మంతరావు సైతం స్పందించారు. సిబిఐ దర్యాఫ్తు ద్వారా జగన్ తన నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. వైయస్ జగన్ అన్ని ఆస్తులు ఎలా కలిగి ఉన్నాడో ఈ విచారణ ద్వారా వెలుగులోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

టిడిపి నేత ఎర్రన్నాయుడు మాట్లాడుతూ వైయస్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ వేలాది కోట్లు అక్రమంగా సంపాదించారని తాము కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నామని అన్నారు. హైకోర్టు నిర్ణయం తమకు సంతృప్తిని కలిగించిందన్నారు. కోర్టులు లేకుంటే జగన్ తప్పించుకునే వారని అన్నారు. కోర్టు ద్వారానైనా జగన్ అవినీతిపరుడుని తేలుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పిసిసి చీఫ్ బొత్స మాట్లాడుతూ జగన్ సిబిఐ విచారణలో ఎలాంటి రాజకీయ కుట్ర లేదన్నారు. విచారణ జరగడం వల్ల జగన్‌కే మంచిదన్నారు. విచారణ జరిగేలా చూసి జగన్ తనపై వస్తున్న ఆరోపణలను అవాస్తవాలని నిరూపించుకునే అవకాశం వచ్చిందని సూచించారు. జగన్ తన నిజాయితీ నిరూపించుకోవాలంటే స్టే తెచ్చుకోకూడదని సలహా ఇచ్చారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్సాఆర్‌ను అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించారనే అపవాదు తన నిజాయితీని నిరూపించుకోవడం ద్వారా తొలగించుకోవాలని సూచించారు. ప్రజా జీవితంలో ఉన్న వారు ఆరోపణలు వచ్చినప్పుడు నిజాయితీ నిరూపించుకోవాలని తాను సైతం వోక్స్ వ్యాగన్ విషయంలో నిజాయితీ నిరూపించుకున్నానని చెప్పారు. కాగా జగన్ అక్రమాస్తులు కలిగి ఉన్నాడని మంత్రి శంకర్ రావు, టిడిపి నేతలు బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణ, కడప జిల్లా లాయరు షేర్వాణి తదితరులు కోర్టులో పిటిషన్ వేశారు. వారి పిటిషన్‌లను సుమోటోగా స్వీకరించిన కోర్టు జగన్ ఆస్తులపై సిబిఐ విచారణకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+