వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఉద్యమంపై 'సోనియా' ఎఫెక్టు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రభావం పడేట్టుగానే కనిపిస్తోంది. ఓ వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా సోనియా గాంధీ శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లడం వలన తెలంగాణ ఉద్యమం తీవ్రతను తగ్గించాలనే యోచనలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై పార్టీ అభిప్రాయం కావాలంటే సోనియా గాంధీయే చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె లేని సమయంలో ఉద్యమించి లాభం లేదని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే సోనియా వచ్చే వరకు ఉద్యమం ఉధృతిని తగ్గించాలనే యోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఉద్యమం నుండి వెనక్కి తగ్గకుండానే ఉధృతి మాత్రమే తగ్గించాలని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొందరు ప్రజాప్రతినిధులు ఉద్యమం ఉధృతిని తగ్గించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లుగా సమాచారం.

తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఉద్యమిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ నిర్ణయం అంతిమ దశలో ఉన్న నేపథ్యంలో ఉద్యమం ఉధృతి తగ్గిస్తే కాంగ్రెసుపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతుందని మరికొందరు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలా, తగ్గించాలా అనే విషయంలో తెలంగాణ కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు తీవ్ర అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం 14ఎఫ్ రద్దు చేసి ఎస్సై పరీక్షలను నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేస్తే తెలంగాణ ఉద్యమ ఉధృతి తగ్గించినా నష్టం ఉండదని మరికొందరు భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఉధృతి తగ్గిస్తే కనుక అదే అదునుగా భావించి అధిష్టానం వారిపై ఉద్యమం నుండి విత్ డ్రా అయ్యేందుకు ఒత్తిడి తీసుకు వచ్చే అవకాశాలను కూడా వారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంటులో సైతం కాంగ్రెసు ఎంపీ సర్వే సత్యనారాయణ వ్యాఖ్యలు సోనియా గాంధీ వెలితిని బట్టబయలు చేస్తోంది. తెలంగాణపై చర్చ జరుగుతున్న సమయంలో తమ అధినేత్రి సోనియా లేక పోవడం బాధాకరం అని ఆయన అన్నారు. సోనియా తెలంగాణకు అనుకూలమని ఆయన పార్లమెంటులో అన్నారు. అందులో భాగంగానే పలువురు ఎంపీలు సోనియా ఆరోగ్యం బాగా లేనందున పార్టీని ఇబ్బందులకు గురి చేయకుండా సమావేశాలకు వెళతామని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. వారి వ్యాఖ్యలను ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఖండించారు. అధినేత్రికి ఆరోగ్యం బాగా లేకుంటే హాస్పిటల్ వెళ్లాలి. కానీ సమావేశాలకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. చివరగా సోనియా అనారోగ్యంతో ఉన్న కారణంగా ఉద్యమానికి విరామం ఇవ్వాలని పిసిసి చీఫ్ బొత్స సూచించడం కొస మెరుపు.

English summary
It seems, Telangana agitation is effected by AICC president Sonia Gandhi's health. T-Congress leaders are thinking now to agitate against high command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X