వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ లొల్లి: రాష్ట్రపతి పాలన, మధ్యంతరం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం ఏ మాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసంభవమని సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు గట్టిగానే చెబుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సీమాంధ్ర నాయకులతో చెప్పిన మాటలు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. తెలంగాణ, సీమాంధ్ర నాయకులతో చర్చలకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ జరిపే చర్చలు కేవలం రాజీనామాల ఉపసంహరింపజేయడానికి మాత్రమేనని కూడా తెలుస్తోంది. రాజీనామాలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రపతి పాలన వస్తుందనే హెచ్చరికలు కూడా చేసే అవకాశం ఉంది.

తెలంగాణ శాసనసభ్యులు రాజీనామాలను వెనక్కి తీసుకోకపోతే శాసనసభను రద్దు చేయాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెసు శాసనసభ్యులకు అందినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం మేరకే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చునని అన్నట్లు భావిస్తున్నారు. శాసనసభను రద్దు చేసి రాష్ట్రపాలన విధించి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీ తెలంగాణ నేతలను రెచ్చగొట్టే రీతిలోనే కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నాయకులు, అధిష్టానం పెద్దలు మాట్లాడుతున్నారు. ఒక రకంగా హెచ్చరికలు చేస్తున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామాలను ఉపసంహరించుకునే పరిస్థితి లేదని అంటున్నారు. కొంత మంది వెనక్కి తగ్గినా చాలా మంది అందుకు సిద్ధంగా లేరని చెబుతున్నారు. ఈ స్థితిలో రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో మార్గం లేదనే భావన కాంగ్రెసు అధిష్టానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 1వ తేదీలోగా తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల రాజీనామాలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజాప్రతినిధులతో ఢిల్లీ చర్చలు విఫలమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్రమైన నిర్ణయమే రావచ్చునని అంటున్నారు.

English summary
It is learnt that Congress high command is not in favour of statehood for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X