వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓడి గెలిచిన యడ్యూరప్ప, గాలి సోదరులకు దెబ్బ

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy-BS Yeddyurappa
ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగే విషయంలో ఓడిపోయిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొత్త ముఖ్యమంత్రి ఎన్నికలో విజయం సాధించారు. గాలి సోదరులకు ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవడానికి యడ్యూరప్ప తీవ్రంగా మొరాయించారు. తాను గద్దె దిగేది లేదంటూ తన శాసనసభ్యులతో బలప్రదర్శన కూడా చేయించారు. తన వర్గానికి చెందిన బిజెపి పార్లమెంటు సభ్యులతో డిమాండ్ చేయించారు. చివరకు పార్టీ అధిష్టానం ఆదేశాలకు తొలగ్గి రాజీనామా చేశారు. తన స్థానంలో సదానంద గౌడను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే రాజీనామా చేస్తానని యడ్యూరప్ప షరతును కూడా బిజెపి అధిష్టానం అంగీకరించలేదు.

యడ్యూరప్పను దెబ్బ తీయడానికి బిజెపి జాతీయ నాయకుడు అనంతకుమార్, మంత్రులు గాలి సోదరులు తీవ్రంగా ప్రయత్నించారు. యడ్యూరప్ప వర్గానికి వ్యతిరేకంగా తమ వర్గాన్ని కూడగట్టారు. వీరంతా జగదీష్ షెట్టర్‌ను బలపరిచారు. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడం, రాజీకి రావడానికి నిరాకరించడం వంటి పరిణామాల నేపథ్యంలో బిజెపి అధిష్టానం పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ రహస్య బ్యాలెట్ నిర్వహించారు. ఈ రహస్య బ్యాలెట్‌లో యడ్యూరప్ప బలపరిచిన సదానంద గౌడ ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాష్ట్ర శాసనసభలో 120 మంది బిజెపి సభ్యులుండగా 118 మంది ఓటింగులో పాల్గొన్నారు.

కాగా, ఇరు వర్గాల మధ్య పోరు ఇంతటితో ముగిసేట్లు లేదు. మంత్రి వర్గ కూర్పు విషయంలో కూడా ఇరు వర్గాలు రాజకీయాలు నడిపే అవకాశం ఉంది. ఈ స్థితిలో స్వేచ్ఛగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం సదానంద గౌడకు ఉండకపోవచ్చు. పైగా, సదానంద గౌడ యడ్యూరప్ప అడుగుజాడల్లో నడవాల్సి ఉంటుంది. అయితే, అధికారం చేజిక్కిన తర్వాత పరిస్థితి ఏ విధంగా మారుతుందో చెప్పలేం.

అక్రమ మైనింగు కుంభకోణంలో లోకాయుక్త తప్పు పట్టడంతో ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి సోదరులను కూడా లోకాయుక్త తప్పు పట్టింది. వారిపై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఈ స్థితిలో గాలి సోదరులకు తిరిగి మంత్రి పదవులు దక్కుతాయా, లేదా అనేది అనుమానంగానే ఉంది.

English summary
Victory of Yeddurappa's candidate Sadananda Gowda as BJLP leader is a blow to Gali brothers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X