వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ దర్యాప్తు: డీలా పడిన వైయస్ జగన్ వర్గం?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
తన ఆస్తులపై సిబిఐ దర్యాప్తును నిలిపేయాలని కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం డీలాపడింది. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల్లో పునరాలోచన ప్రారంభమైంది. సుప్రీంకోర్టు నిర్ణయం కోసం శుక్రవారం వరకు ఉత్కంఠగా ఎదురు చూసిన వైయస్ జగన్ వర్గం నాయకులు ఆ నిర్ణయం వెలువడగానే తీవ్ర నిరాశకు లోనయ్యారు. తాము జగన్ వెంట నడిచి తప్పు చేశామా అనే ఆలోచనలో వారు పడినట్లు చెబుతున్నారు. ఇది ప్రాథమిక విచారణతో ఆగదని, పూర్తి స్థాయి విచారణకు దారి తీయవచ్చునని జగన్ వర్గం నాయకులు భయపడుతున్నారు.

సిబిఐ విచారణ ఎటు దారి తీస్తుందనేది, జగన్ రాజకీయ భవిష్యత్తు ఏమమవుతుందనే అంతుపట్టడం లేదనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. వైయస్ జగన్ భవిష్యత్తు సరే, తమ భవిష్యత్తు ఏమవుతుందనే కలవరానికి వారు గురవుతున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ప్రాథమిక విచారణకు వైయస్ జగన్ సహకరించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తమ నాయకుడు విచారణకు సహకరిస్తున్నారని, నిజాయితీని నిరూపించుకునేందుకు సిద్ధపడ్డారని చెప్పుకోవడానికి వీలయ్యేదని అంటున్నారు.

సుప్రీంకోర్టులో చుక్కెదురు కావడంతో జగన్‌పై రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పుకోవడానికి తప్ప మరో రకంగా తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. కాంగ్రెసు అధికారంలో కొనసాగడానికి ఇంకా మూడేళ్ల గడువు ఉంది. అంత సమయం ఉండగా ఇప్పటి నుంచే జగన్ వెంట నడుస్తూ తప్పు చేశామా అనే ఆలోచన కూడా వారిని తొలచి వేస్తోందని అంటున్నారు. ఈ నెల 26వ తేదీన సిబిఐ హైకోర్టుకు సమర్పించే నివేదికపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఏమైనా, వైయస్ జగన్ వర్గం ప్రజాప్రతినిధుల్లో కలవరం మొదలైందని అంటున్నారు. ఒకవేళ పూర్తి స్థాయి సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశిస్తే మాత్రం తట్టుకోవడం కష్టమే అవుతుందని అనుకుంటున్నారు.

English summary
It is said that YSR Congress party president YS Jagan is in dilemma in continuing in YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X