వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ భయంతోనే ప్రత్యేకాధికారులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-Kiran Kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భయం పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే జగన్‌కు మద్దతుగా 23 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయగా, తెలంగాణకు చెందిన ముగ్గురు సైతం జగన్ వెంట వెళుతూ సిఎంకు ముచ్చెమటలు పోయిస్తున్నారు. ఇలాంటి సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ జగన్ భయంతో ముఖ్యమంత్రి వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. సోమవారంతో గ్రామాల్లో సర్పంచుల పాలన ముగిసింది. మంగళవారం నుండి ప్రత్యేకాధికారుల పాలనలోకి వస్తుంది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు సార్లు గ్రామపంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయి. అయితే ప్రతిసారి గ్రామ సర్పంచులకే అధికారాన్ని కట్టబెట్టేది ప్రభుత్వం.

కానీ ఈసారి మాత్రం గ్రామ సర్పంచులకు కాకుండా పర్సన్ ఇంచార్జులుగా ప్రత్యేకాధికారులను నియమిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సోమవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇరవై ఒక్క వేలకు పైగా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమవుతుంది. ప్రత్యేకాధికారులుగా గెజిటెడ్ ఆఫీసర్లను నియమించింది. ఏ పంచాయతీకి ఎవరు అనే నిర్ణయాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. అయితే సర్పంచులకు కాకుండా గెజిటెడ్ ఆఫీసర్లకు ప్రత్యేకాధికారులు ప్రభుత్వం అప్పగించడం వెనుక జగన్ భయమే అని పలువురు అభిప్రాయం.

ప్రస్తుత సర్పంచుల్లో మూడొంతుల మంది కాంగ్రెసు వారే. అయితే జగన్ పార్టీ వీడి సొంత కుంపటి పెట్టాక కాంగ్రెసు సర్పంచులలో అధికమంది జగన్ వెంట వెళుతున్నట్టు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సర్పంచులనే కొనసాగించడం ద్వారా జగన్ పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశ్యంతో సిఎం ప్రత్యేకాధికారుల వైపు మొగ్గినట్లు తెలుస్తోంది.

English summary
It seems, YSRC party president YS Jaganmohan Reddy fear to CM Kiran Kumar Reddy due to his decision on person incharges to gram panchayat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X