బొత్స విందులో పురంధేశ్వరి, బల నిరూపణా?

అయితే ఆయన పర్యటన రద్దు కావడంతో విందును చివరి నిమిషంలో విశాఖకు మార్చారని సమాచారం. అధ్యయన యాత్రకు వచ్చిన ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ విందులో పాల్గొన్నారు. దీంతో కొత్త సమీకరణాలకు తెరలేచినట్లయింది. బొత్స వారికి ప్రత్యేకంగా విందు ఇవ్వడం సర్వత్రా చర్చానీయాంశమయింది. ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి కూడా ఈ విందుకు హాజరయ్యారు. విందుకు హాజరైన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు బొత్సకు అభినందనలు తెలిపారు. విందు ద్వారా బొత్స తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విశాఖ వచ్చిన సిఎంను ఆయన కలుసుకోక పోవడం కూడా చర్చనీయాంశమైంది. విందులో బొత్స పార్టీ పటిష్టతను గురించి శాసనసభ్యులకు వివరించారట.












Click it and Unblock the Notifications