వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పునర్వ్యవస్థీకరణ: ఎవరు బయటకు ఎవరు లోపలకు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనుండటంతో ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై జోరుగా చర్చ జరుగుతోంది. చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరితో విస్తరణ చేసి సరిపెట్టుకోవాల్సిందిగా అధిష్టానం చెబుతుండగా ముఖ్యమంత్రి మాత్రం పునర్వ్యవస్థీకరణకే మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. పునర్వ్యవస్థీకరణే లక్ష్యంగా సిఎం సాయంత్రం ఢిల్లీకి వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. సిఎం కోరిక మన్నిస్తే మంత్రివర్గం నుండి బయటకు వెళ్లే వారెవరు, వచ్చే వారెవరు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో, బయట జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రుల తోట నర్సింహం, అహ్మదుల్లా, డిఎల్ రవీంద్రా రెడ్డి, శంకర రావులను బయటకు పంపించాలని సిఎం భావిస్తున్నట్లుగా సమాచారం. డిఎల్ సమయం వచ్చినప్పుడల్లా సిఎంపై తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక రూపాయి కిలో బియ్యం వంటి ప్రభుత్వ పథకాలపై పెదవి విరిచారు. ఇక శంకర రావు మంత్రివర్గంలో ఉంటూనే సిఎంకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నిత్యం సిఎంపై విమర్శలు చేస్తున్నారు. మంత్రివర్గంలో కొందరు అవినీతిపరులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా నిత్యం తనను టార్గెట్ చేస్తున్న ఇలాంటి వారిని బయటకు పంపించి తనకు అనుకూలురైన వారిని తీసుకోవాలని సిఎం భావిస్తున్నారు.

ఇక సిఎం పీఠంపై కన్నేసిన పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను కూడా మంత్రివర్గం నుండి తప్పించాలని సిఎం భావిస్తున్నారట. పిసిసి చీఫ్‌గా, రవాణా శాఖ మంత్రిగా ఉన్న బొత్స జోడు పదవుల అంశాన్ని లేవనెత్తి ఆయనకు చెక్ చెప్పాలని సిఎం భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఖాళీగా ఉన్న కేబినెట్ పదవులకు తోడు అధిష్టానం ఆమోదించిన పక్షంలో సిఎం మరికొందరిని బయటకు పంపిస్తే పన్నెండుకు పైగా కెబినెట్ పదవులు ఖాళీ అవుతాయి. తద్వారా తనకు అనుకూలురైన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కిరణ్ భావిస్తున్నారు. పునర్వ్యవస్థీకరణకు అధిష్టానం తలూపిన పక్షంలో వరంగల్ జిల్లా నుండి గండ్ర వెంకట రమణా రెడ్డి, శ్రీకాకుళం జిల్లా నుండి కొండ్రు మురళీ, కడప జిల్లా నుండి జానీలను మంత్రి వర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అనంతకు చెందిన జెసి దివాకర్ రెడ్డి, జగ్గారెడ్డిలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయం, విద్యుత్ వంటి కీలక శాఖలు సిఎం చేతుల్లోనే ఉండటంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. అయితే చిరు వర్గానికి చెందిన ఇద్దరితో సరిపెట్టుకోవాలని అధిష్టానం చెబుతుండటం, పునర్వ్యవస్థీకరణకు సిఎం పట్టుబడుతున్న నేపథ్యంలో విస్తరణ మరోసారి వాయిదా పడే అవకాశముందనే ప్రచారం కూడా జరుగుతోంది.

English summary
Cabinet reshuffle discussion is going very seriously in Congress party with CM Kiran Kumar Reddy delhi tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X