జానారెడ్డి తెలంగాణ పోరుకు సిఎం చెక్

Jana Reddy - Kiran Kumar Reddy
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ప్రయత్నాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెక్ పెడుతున్నారని అంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ జానా రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, ఇతర నేతలు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జానా రెడ్డి ఇంట్లో ఎంపీలు కూడా తేదీలు ఖరారు చేసుకునేందుకు భేటీ అయ్యారు. అయితే ఆ సమావేశంలో అందరూ కలిసి ఢిల్లీ వెళ్లాలని ఓ నిర్ణయానికి వచ్చినప్పటికి తదుపరి భేటీలో ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇందులో భాగంగా జానా రెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర నేతలతో మరోసారి భేటీ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలకు సిఎం మోకాలడ్డుతున్నారని అంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశానికి వెళ్లకుండా సిఎం చేస్తున్నారట. దీంతో జానా సమావేశానికి వారు మొహం చాటేస్తున్నారని అంటున్నారు. వారు సమావేశానికి దూరంగా ఉండటంతో ఆయన జానా ప్రయత్నాలు విఫలమవుతున్నాయని అంటున్నారు.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తెలంగాణలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అదే సమయంలో జాతీయ స్థాయిలో తమ ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణపై ఖచ్చితమైన వైఖరితో ఉన్న బిజెపి మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో గెలుపొందటం తెలంగాణ కాంగ్రెసు నేతలను పునరాలోచనలో పడేసింది. టిఆర్ఎస్ తెలంగాణ నినాదం కారణంగా గ్రామాలలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల తెలంగాణ కోసం వరుస ఆత్మహత్యలు కూడా జరిగాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణపై అధిష్టానాన్ని ఎలాగైనా ఒప్పించాలని తెలంగాణ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఉప ఎన్నికల అనంతరం జానారెడ్డి, పార్లమెంటు సభ్యులు పలుమార్లు భేటీ అయి ఢిల్లీ వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ వెళ్లే అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఓ తేదీ నిర్ణయించాలని భావించారు. వీరిని సమన్వయం చేసే పని మంత్రి జానా రెడ్డి చూస్తున్నారు.

ఇందు కోసం గత నెల మార్చి 25న జానా రెడ్డి ఇంట్లో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటన తేది నిర్ణయం, అధిష్టానంపై ఎలా ఒత్తిడి తీసుకు రావాలో తదితర అంశాలపై జానా తాజాగా భేటీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సిఎం కారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీకి సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+