• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణపై కాంగ్ వ్యూహం: నెపం మరొకరి పైకి

By Srinivas
|

Telangana Map - Sonia Gandhi
ఈ నెలాఖరుకల్లా తెలంగాణ పై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేస్తుందని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒకటికి రెండు సార్లు చెప్పినా వాస్తవ పరిస్థితి అలా కనిపించటం లేదు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి శనివారం శాసనసభ సమావేశాలు ముగిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్ద, కేంద్ర మంత్రి వయలార్‌ రవి అదే రోజున తన నివాసంలో మలయాళీ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కెసిఆర్‌ కనబరచిన ధీమా వాస్తవ రూపం దాలుస్తుందా అనే అనుమానం కలుగు తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.

పరిస్థితిని బట్టి చూస్తే పార్టీ పరంగా కాంగ్రెస్‌ తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయాన్ని ప్రకటించి, రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకిస్తున్న ములాయం లాంటి వారి మద్దతు తీసుకుంటున్న యూపిఏ సర్కార్‌తో నో అనిపిస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఇప్పటిదాకా అంతగా మాట్లాడని ముఖ్యమంత్రి శనివారం తెలంగాణ విషయాన్ని దాదాపుగా తేటతెల్లం చేసినట్టు కనిపిస్తున్నది. తన మాటలుగా కాకపోయినా కేంద్రం మనసులో ఏముందో ఆయన చెప్పకనే చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ పరంగా అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుందని, ఆ తర్వాత కేంద్రం తెలంగాణపై ప్రకటన చేస్తుందనీ కిరణ్‌ చెప్పారు.

తెలంగాణపై నిర్ణయం అంత సులభం కాదని, అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని కిరణ్‌ అన్నారంటే కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆలోచనలు అదే దారిలో పయనిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కిరణ్‌ చెప్పిన మాటలను చాలా జాగ్రత్తగా విశ్లేషించాల్సి ఉందని కాంగ్రెస్‌ నేతలే అంగీకరిస్తున్నారు. ఎలాగైనా తెలంగాణ సాధించాలని ఢిల్లీలో మకాం వేసిన కెసిఆర్‌తో విరోధాలు రాకుండా చూసుకోవటం, అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ తుడిచి పెట్టుకుపోకుండా కాపాడుకోవటం అనే ద్విముఖ వ్యూహాన్ని కాంగ్రెస్‌ అనుసరిస్తున్నదని కొందరు నేతలు అన్నారు.

అంటే తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసేందుకైనా వెనుకాడబోనన్న కెసిఆర్‌ను దూరం చేసుకోకుండా పార్టీ పరంగా తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని ప్రకటించటం, ఆ తర్వాత అంశాన్ని యూపిఏ భాగస్వామ్య పక్షాలకు నివేదించటం అన్న ద్విముఖ వ్యూహాన్ని కాంగ్రెస్‌ అనుసరించనున్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టిడిపి కూడా త్వరలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వాలనుకుంటున్నది కాబట్టి అంతకు ముందే తాము ఆ పని చేస్తే తెలంగాణలో తల ఎత్తుకు తిరిగే అవకాశం ఉంటుందని, అటు కెసిఆర్‌ను సైతం మెప్పించి నట్టవుతుందనీ కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దల ఆలోచనగా ఉన్నట్టు చెబుతున్నారు.

కేంద్రంలో కాంగ్రెస్‌ ఒక్కటే ప్రభుత్వం నడపటం లేదు కాబట్టి, అనేక పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. కాబట్టి పార్టీ పరంగా తన అభిప్రాయాన్ని యూపిఏ భాగస్వామ్య పక్షాలకు నివేదిస్తే సరిపోతుందన్న ఆలోచనతో కాంగ్రెస్‌ అధినాయకత్వం ఉన్నట్టు చెబుతున్నారు. తెలంగాణ అంశాన్ని పార్టీ పరంగా ఆమోదించి యూపిఏ మెడకు కడితే అది తమ మెడకు చుట్టుకోకుండా ఉంటుందన్న వ్యూహంతో కాంగ్రెస్‌ ఉన్నట్టు కనిపిస్తున్నది. మమతా బెనర్జీ యూపిఏ కూటమి నుంచి వెళ్ళిపోవటంతో సమాజ్‌వాది పార్టీ నేత ములాయం మద్దతు కేంద్ర ప్రభుత్వానికి అనివార్యం.

చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కానీ, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కానీ ములాయం బద్ధ వ్యతిరేకి. ఒకవేళ తెలంగాణ ఇవ్వటానికే కాంగ్రెస్‌ నిర్ణయించుకుంటే కేంద్రంలో సర్కా ర్‌ను చేజార్చుకోవలసి ఉంటుంది. అందుకే తాము అంగీకరించినా ములాయం అంగీకరించటం లేదన్న నెపం చూపి తెలంగాణ అంశాన్ని సాగదీ యవచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో నేత, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ కూడా తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించే పరిస్థితి లేదు. ఆయన అందుకు ఒప్పుకుంటే స్వరాష్టమ్రైన మహారాష్టల్రో విదర్భ వాదం చెలరేగుతుంది. డిఎంకె సైతం తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించే అవకాశాలు లేవంటున్నారు.

English summary

 It is said that Congress party is going with complete strategy on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X