తెలంగాణ నేతల ఆకాంక్షకు భిన్నంగా జగన్?

ys jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోని తన పార్టీ నేతల అభీష్టానికి వ్యతిరేకంగా వెళుతున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలలో పోటీ చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సత్తా చాటాలని తెలంగాణ నేతలు భావించారు. అందులో భాగంగా మాజీ ఆర్టీసి చైర్మన్ గోనె ప్రకాశ రావు వంటి నేతలు తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా పోటీ చేయాలని సూచించారు. గోనె లాగే పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ నేతలు తెలంగాణలో పోటీకి దిగి జగన్ సత్తా చూపించాలని భావించారు. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోటీలో దిగేందుకు కొందరు అభ్యర్థులు కూడా సిద్ధపడినట్లుగా తెలుస్తోంది.

అయితే రెండు రోజుల క్రితం జగన్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తున్నామని అందుకే రాజీనామా చేసిన వారి స్థానంలో తాము అభ్యర్థులను నిలబెట్టడం లేదని ప్రకటన చేశారు. దీంతో నేతలు నిరుత్సాహానికి గురయ్యారట. అప్పటికే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ కారణంగా తమ పార్టీ మంచి ఓట్లు రాబట్టగలిగేదని, జగన్ చేసిన ప్రకటనతో తెలంగాణలో పార్టీకి మరింత క్రేజ్ వచ్చిందని, దీనిని ఉప ఎన్నికలలో పోటీ చేసి నిరూపించుకుంటే బావుండేదని, కానీ తెలంగాణకు దాదాపు అనుకూల ప్రకటన చేసిన తమ పార్టీ అధినేత ఉప ఎన్నికలకు వెనక్కి పోవడం ఆ పార్టీ నేతల్లో అసంతృప్తిని కలిగించినట్లుగాసమాచారం. కొండా సురేఖపై టిఆర్ఎస్ పోటీ చేయకూడదన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.

తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని చెప్పిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకే ఆ ప్రాంతంలో టిఆర్ఎస్ నుండి మినహా పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదని, అలాంటి సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తున్నామని చెప్పడం ద్వారా జగన్ చంద్రబాబుకంటే ఎంతో ముందడుగేశారని దానిని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకుంటే బావుండేదని వారు అభిప్రాయపడుతున్నారట. అంతేకాదు ఓదార్పు, యాత్రల పేరిట ఇప్పటి వరకు సీమాంధ్ర జిల్లాలకే పరిమితమైన జగన్‌కు ఉప ఎన్నికల ద్వారా మంచి అవకాశం వచ్చిందని కానీ దానిని సద్వినియోగం చేసుకోలేక పోయారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+