అతని ఓటమే లక్ష్యంగా జయప్రద, వారంపాటు తిష్ట

మరోవైపు అజం ఖాన్‌కు నోటీ దురుసు ఎక్కువ అనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ఆయన గతంలో పలుమార్లు దెబ్బతిన్నారు. తాజాగా ఆయన కాంగ్రెసును హిజ్రాల పార్టీగా అభివర్ణించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాంపూర్‌లో తాను విజయం సాధించి జయప్రదకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. జయప్రద అమర్ స్థాపించిన రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీకి ఉపాధ్యక్షురాలు. మరోవైపు అమర్ సింగ్ కూడా తనను పార్టీ నుండి బయటకు గెంటి తన తనయుడు అఖిలేష్ కుమార్‌కు ములాయం సింగ్ పగ్గాలు అప్పగించడంతో సమాజ్ వాదీని ఒడించేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తాను ఎలాగూ గెలవనని ఆయనకు తెలుసు. అందుకే ఆయన మొదటి నుండి తమకు వ్యతిరేకమైన మాయావతి ఆధ్వర్యంలోని బిఎస్పీని, తనను బయటకు గెంటివేసిన సమాజ్ వాదీ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధ్యమైనంత మేర ఎస్పీ, బిఎస్పీ ఓట్లు చీల్చి ములాయం, మాయాల విజయావకాశాలు దెబ్బకొట్టాలనే వ్యూహంతో ఆయన ఉన్నారు.
తన పార్టీకి బకెట్ గుర్తు కేటాయించడంపై ఆయన ప్రచారంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యుపి రాజకీయాల్లోని మురికిని బకెట్‌తో కడిగేస్తానని ఆయన చెబుతున్నారు. తనవల్లే యుపిఏ ప్రభుత్వం సంక్షోభం నుండి అనేకసార్లు బయటపడిందని చెబుతున్నారు. ములాయం తనకు చేసిన ద్రోహం గురించి ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి యుపి ఎన్నికలు ఆప్తమిత్రులు అయిన అమర్ సింగ్, జయప్రదల భవిష్యత్తుకు పెద్ద పరీక్ష అని చెప్పవచ్చు.