వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2రోజుల హీట్: అసలేం జరిగింది, కిరణ్‌లో మార్పు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో ఢిల్లీ రెండు రోజుల పాటు వేడెక్కింది. ముఖ్యమంత్రి మార్పు అని, పిసిసి చీఫ్‌కు ఎసరు అని, చిరంజీవికి ముఖ్య పదవి అని ఇలా జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత చూస్తే అంతా ఒక్కసారిగా సైలెన్స్‌గా మారి రాష్ట్రంలో మన ముఖ్య నేతలు యధావిథిగా తమ పనులు చేసుకు వెళ్తున్నారు. ఒక్కసారిగా వేడెక్కి.. తర్వాత అదే స్థాయిలో చల్లబడటంపై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీలో అసలేం జరిగింది, అధిష్టానం ముఖ్య నేతలకు ఏం చెప్పింది అనే విషయమై రాష్ట్ర కాంగ్రెసు నేతలు జుట్టు పీక్కుంటున్నారు.

ఢిల్లీలో ఏం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు మంత్రులు, కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీ టూర్ ఎలా జరిగిందని పలువురు మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డిని ప్రశ్నించగా... చాలా చాలా బాగా జరిగిందని నవ్వుతూ చెప్పారట. అంతేకాదు మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా శాఖాపరమైన అంశాల్లోకి వెళ్లిపోయారట. దీంతో, అసలు ఢిల్లీలో విశేషాలపై మంత్రులకు కూడా పూర్తి సమాచారం అందలేదు. శనివారం ముఖ్యమంత్రిని పలువురు మంత్రులు కలిశారు.

వీరిలో పలువురు వారి శాఖపరమైన అంశాలపై సిఎం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కిరణ్‌ కంటే మూడు రోజుల ముందే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన సోనియాతో మినహా మిగిలిన ముఖ్యనేతలందరితో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లిన రోజున పిసిసి అధ్యక్షుడిని తొలగిస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. అదే సమయంలో సిఎంను కూడామారుస్తున్నట్లుగా మరోవర్గం ప్రచారం చేసింది. రాష్ట్ర ముఖ్య నాయకులిద్దరి నుంచి అధిష్ఠానం రాజీనామా పత్రాలను తీసుకుందని కూడా ప్రచారం జరిగింది.

దీనిని అధిష్ఠానం పెద్దలు ఎవరూ ద్రువీకరించలేదు. కిరణ్, బొత్స కూడా అంతా ఉత్తుతిదే అంటూ కొట్టిపారేస్తున్నారు. పైగా వారిద్దరూ ఉల్లాసంగా, ఉత్సాహంగానే కనిపిస్తున్నారు. కొందరు మంత్రులు మాత్రం సిఎంను వ్యక్తిగతంగా కలిసినప్పుడు వివరాలపై ఆరా తీశారట. మీడియాలో వస్తున్నట్లుగా అధిష్ఠానం తనపై సీరియస్‌గా లేదని.. సుహృద్భావ వాతావరణంలోనే తన పర్యటన జరిగిందని వివరించారట. ఇదే సమయంలో మంత్రి ధర్మాన రాజీనామా వ్యవహారం పైనా కొందరు మంత్రులు ఆరా తీశారట.

ఈ అంశంపై నిర్ణయాధికారాన్ని అధిష్ఠానం తనకే విడిచి పెట్టిందని... న్యాయ నిపుణులతో సంప్రదించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని సిఎం స్పష్టం చేశారు. దీంతో, ఇప్పటికిప్పుడే ధర్మాన విషయంలో ఎలాంటి నిర్ణయాలూ ఉండకపోవచ్చని సిఎంను కలసి వచ్చిన మంత్రులు చెబుతున్నారు. ముఖ్యమంత్రితో అత్యంత సన్నిహితంగా మెలిగే మరికొందరు మంత్రులు కూడా కిరణ్‌ను మారుస్తారన్న కథనాలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేస్తున్నారు.

కాగా... ఢిల్లీ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి వైఖరిలో మార్పు స్పష్టంగా కన్పించిందని ఒక సీనియర్ మంత్రి పేర్కొన్నారు. గతంలో మంత్రులు ఏదైనా చెబుతుంటే వినీ విననట్లుగా ఉండేవారని, ఢిల్లీ నుంచి వచ్చాక మారిపోయారని, తాము చెబుతున్నది ఆసక్తిగా విన్నారని, ఈ మార్పును స్వాగతించాల్సిందేనని చెబుతున్నారట.

English summary
It is said that ministers of Andhra Pradesh were found change in CM Kiran Kumar Reddy attitude after his Delhi tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X