హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఫైట్: కెసిఆర్ వెయిట్ అండ్ సీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
తెలంగాణ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయంలో కేంద్రానికి మరికొంతకాలం వెసులుబాటు కల్పిస్తే బావుంటుందని కెసిఆర్ భావిస్తున్నారని అంటున్నారు. కెసిఆర్ కేంద్రానికి విధించిన గడువు ముగిసినప్పటికీ, తెలంగాణపై ఢిల్లీ నుంచి ప్రకటన వస్తుందనే విశ్వాసం పార్టీ ముఖ్యుల్లో వ్యక్తమవుతోంది. తొందరపడి భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేసుకోవటం కంటే, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేవరకు ఓపిక పట్టాలని పార్టీ నిర్ణయించింది.

ఈ క్రమంలోనే తెరాస ఈ నెల 24 నుంచి ప్రారంభం కావాల్సిన పార్టీ సమావేశాల వాయిదా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై కేంద్రానికి తెరాస అధినేత కెసిఆర్ విధించిన గడువు ఈ నెల 20తో ముగిసింది. ఆలోపు కేంద్రం తెలంగాణ ఇస్తే సంబరం.. లేకపోతే సమరమని చెప్పిన గులాబీ దళపతి భవిష్యత్తు కార్యాచరణ ఖరారు కోసం ఈనెల 24, 25, 26 తేదీల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సమావేశాలను ఇప్పుడు కాకుండా సెప్టెంబర్ మొదటి పక్షంలో నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు.

ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతుండటం, ఈలోపే కాంగ్రెస్ కోర్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ సమావేశాలు పలు దఫాలు జరిగే అవకాశం ఉండటం, వాటిల్లో తెలంగాణ అంశం ప్రస్తావనకు వస్తుందని భావిస్తుండటం, పార్లమెంటు సమావేశాల్లోపు లేదా ముగిసిన తర్వాత కేంద్రం తెలంగాణపై ఒక ప్రకటన చేస్తుందనే విశ్వాసం వంటి కారణాలు పార్టీ సమావేశాల వాయిదా నిర్ణయం తీసుకోవటానికి దోహదం చేశాయని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఒకరు తెలిపారు.

ఇప్పుడు సమావేశాలు నిర్వహిస్తే తెలంగాణ సాధన కోసం ఏదో ఒక కార్యాచరణ తీసుకోవాల్సిందేనని, కేంద్రం నుంచి తెలంగాణపై ఒక నిర్ణయం వస్తుందనే వార్తల నేపథ్యంలో కార్యాచరణ తీసుకోవటం రాజకీయంగా తమకు ఇబ్బంది అని, అలాగని సమావేశాలు నిర్వహించి కార్యాచరణ తీసుకోకుంటే బాగుండదని, ఇప్పటికే సిపిఐ, బిజెపి కార్యాచరణ ప్రకటించాయని, తెలంగాణ మార్చ్ పేరిట సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలంగాణ జెఏసి వెల్లడించి.. దానిని విజయవంతం చేసే దిశగా సాగుతోందని చెబుతున్నారు.

ఈక్రమంలో పార్టీ సమావేశాలు నిర్వహించి కార్యాచరణ తీసుకోకుండా బద్నాం కావటం కంటే పార్లమెంటు సమావేశాలు పూర్తయ్యే వరకు ఓపిక పట్టి.. కేంద్రం నుంచి తెలంగాణపై నిర్ణయం వస్తుందో? రాదో? వేచి చూసి ఆ తర్వాత పార్టీ సమావేశాలు నిర్వహించటమే మేలని కెసిఆర్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

English summary
It is said that Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao is thinking to wait on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X