టర్కీలో సైనిక తిరుగుబాటుకు ఐదు కారణాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇస్తాంబుల్: 1960 నుంచి టర్కీలో నాలుగు సార్లు సైనిక తిరుగుబాటు జరిగింది. తాజాగా శుక్రవారం జులై 16న జరిగిన సైనిక తిరుగుబాటు నాల్గవది కావడం విశేషం. వివిధ కారణాల చేత ఈ సైనిక తిరుగుబాటు విజయవంతం కాలేదని విదేశీ పర్యనటలో ఉన్న టర్కీ దేశాధ్యక్షుడు ఎర్డోగన్ పేర్కొన్నారు.

సైనిక తిరుగుబాటుని ఖండించిన ఆయన ఈ తిరుగుబాటులో పాలుపంచుకున్న వారు త్వరలో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ పిరిస్థితిని త్వరలోనే అధిగమిస్తామని ఎర్డోగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి మద్దతు తెలపాలని ఎర్డోగన్ పిలుపనిచ్చారు.

దీంతో ఎర్డోగన్‌కు మద్దతుగా ప్రజలు వీధుల్లోకి వచ్చి మద్దతు తెలిపారు. దీంతో టర్కీ రాజధాని ఇస్తాంబుల్, అంకారా పట్టణాల్లో ప్రజలు పెద్దఎత్తన వీధుల్లోకి వచ్చారు. ఇస్తాంబుల్‌లోని ప్రఖ్యాత టక్మిమ్ కూడలి వద్ద సైనికులు, ప్రజల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌తో సహా దేశం మొత్తాన్ని సైనికులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇస్తాంబుల్‌లోని స్థానిక ఎయిర్ పోర్ట్ వద్ద భారీగా సైనికులు మోహరించారు. టర్కీలో ఇప్పటి వరకు నాలుగు సార్లు 1960, 1971, 1980, 1993లో సైనిక తిరుగుబాటు జరిగింది.

టర్కీలో సైనిక తిరుగుబాటు: వీధుల్లోకి ప్రజలు, భారత్ అప్రమత్తం

టర్కీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై హెలికాప్టర్ గన్ షిప్పుతో సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 42 మంది మరణించారు. మరోవైపు టర్కీ పార్లమెంట్‌పై సైన్యం మూడు బాంబులను ప్రయోగించింది. దాంతో ఎంపీలు పార్లమెంట్ షెల్టర్‌లో తల దాచుకున్నారు.

ఇలా టర్కీలో ప్రధాన నగరాలైన ఇస్తాంబుల్, అంకారాలలో తిరుగుబాటు సైనికులు, ప్రభుత్వ అనుకూల సైనికుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇలా ఆర్మీలోని ఒక వర్గం చేసిన దాడిలో మృతుల సంఖ్య 60కు చేరింది. మరోవైపు టర్కీలో సైనిక తిరుగుబాటు బెడిసికొడుతోంది.

తిరుగుబాటు సైనికులను ప్రజలు, పోలీసులు ఎక్కడికక్కడ బంధిస్తున్నారు. దీంతో దేశంలోని పలు చోట్ల ప్రభుత్వానికి సైనికులు లొంగిపోతున్నారు. టర్కీలో సైనిక తిరగుబాటు జరగడానికి గల కారణాలను విశ్లేషిస్తే:

ఎర్డోగన్ పాలనపై ఆర్మీ సంతోషంగా లేదు

ఎర్డోగన్ పాలనపై ఆర్మీ సంతోషంగా లేదు

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పాలనపై ఆర్మీ సంతృప్తికరంగా లేదు. ఆర్మీకి అధ్యక్షుడికి కోల్డ్ వార్ జరుగుతోంది. ఇస్లామిక్ సానుభూతిపరుడు ఫతుల్లా గులెన్‌తో ఆర్మీకి చెందిన కొందరు ఆఫీసర్లు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో కొందరు అధికారులను ఆయన జైలుకు పంపారు.

రాజ్యాంగం మార్పుకు మద్దతు లేదు

రాజ్యాంగం మార్పుకు మద్దతు లేదు

ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఎప్పుడూ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు. 2002లో ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నా, అందుకు కొందరు అనుమతించడం లేదు.

అధికారం అంతా ఎర్డోగాన్ చేతిలోనే

అధికారం అంతా ఎర్డోగాన్ చేతిలోనే

అధ్యక్షుడిగా ఉన్న ఎర్డోగాన్ పాలన మొత్తాన్ని తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. టర్కీలో ప్రజలు, రాజకీయ నాయకులు సైతం ఆయన చెప్పినట్టుగానే నడుచుకోవాలని, ఓ నియంత లాగా పాలన కొనసాగిస్తున్నారనేది కొందరి వాదన. దీనిని సహించలేని సైన్యం తిరుగుబాటు చేసింది.

పాశ్చాత్య దేశాల నాయకులతో సంబంధాలు

పాశ్చాత్య దేశాల నాయకులతో సంబంధాలు

2002లో అధ్యక్ష పీఠం అధిరోహించిన ఎర్డోగాన్ అప్పటి నుంచి పాశ్చాత్య దేశాల నేతలతో సన్నిహత సంబంధాలను కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఎర్డోగాన్ అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఢిఫెన్స్ రంగంలో కొత్త పుంతలు తొక్కించారు. టర్కీ ప్రస్తుతం నాటోలో సభ్య దేశంగా ఉంది.

ఇస్లామిక్ విలువలు

ఇస్లామిక్ విలువలు

టర్కీ ప్రభుత్వం ఆ దేశ ప్రజలపై ఇస్లామిక్ విలువలను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోండటం కూడా ఒక కారణం. నిజానికి దేశంలో మెజారిటీ ప్రజలు సెక్యులర్ విలువలను కోరుకుంటున్నారు. ఈ కారణాల దృష్ట్యా టర్కీలో సైనిక తిరుగుబాటు మొదలైంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Since year 1960 Turkey has witnessed three military coups. On Friday, July 16 yet another attempt to stage a military coup was made. While the government has claimed that the coup is not successful it would still need to ponder over a couple of issues.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి