ఏడాదిక్రితం ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రేమలో పడింది: కేజ్రీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. దీనిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం నాడు స్పందించారు. గత సంవత్సరం ఇదే రోజున ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీతో ప్రేమలో పడిందని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించారు. 'ఢిల్లీ ప్రజలు ఏఏపీతో ప్రేమలో పడిన రోజు ఇది' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రజలతో ఈ బంధం నిత్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హస్తినలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రజా సంక్షేమ పథకాలను ప్రకటించనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.

తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడనున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications