ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నిడుదవోలు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోకవర్గాల పునర్విభజనలో భాగంగా నిడుదవోలు కొత్తగా ఏర్పడింది. పెరవలి మండలం పెనుగొండ నియోజకవ ర్గం నుండి..తణుకు-పెనుగొండ లో ఉన్న ఉండ్రాజవరం మండాలన్ని ఈ నియోజకవర్గంలో కలిపారు. అంతకు ముందు ఉన్న అత్తిలి నియోజకవర్గం 2009 లో రద్దు అయింది. అత్తిలి నియోజకవర్గంలో మాజీ మంత్రులు దండు శివరామరాజు మూడు సార్లు, కనుమూరి బాపిరాజు అయిదు సార్లు , ఇందుకూరి కృష్ణం రాజు ఒకసారి గెలిచారు. నియోజకవర్గాల పునర్వి భన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడ టిడిపి గెలిచింది. ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్దిగా శ్రీనివాస్ నాయుడు పోటీ చేసారు. అదే ఎన్నికల్లో ప్రజారాజ్యం సైతం గణనీయంగా ఓట్లను సాధించింది.
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో..
2009 లో రద్దు అయిన అత్తిలి నియోజకవర్గంలో 1955 నుండి 2004 వరకు అయిదు సార్లు కాంగ్రెస్ గెలవగా, అయిదు సార్లు టిడిపి గెలిచింది. కాగా, సిపిఐ ఒక సారి గెలుపొందింది. ఇక, 2009 లో ఏర్పడని నిడుదవోలు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన రెండు సార్లు కూడా టిడిపి గెలుపొందింది.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 190691 ఓట్లు ఉండగా ,అందులో 162505 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన శేషారావుకు 8591 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన రాజీవ్ కృష్ణకు 75232 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్దిగా పోటీ చేసి న శేషారావుకు 6359 ఓట్ల మెజార్టీ దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాల్లోనూ 2014 ఎన్నికల్లో టిడిపి 14 స్థానాలు గెలుచుకోగా, బిజెపి ఒక స్థానం దక్కించుకుంది.












Click it and Unblock the Notifications