ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ర‌ద్ద‌యిన క‌డియం నియోజక‌వ‌ర్గం నుండి క‌డియం, రాజ‌మండ్రి రూర ల్‌, అర్బ‌న్ లోని కొన్ని ప్రాంతాల‌తో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. 2009 వ‌ర‌కు ఉన్న క‌డియం నియోజ‌క‌వ‌ర్గం నుండి కాం గ్రెస్ సీనియ‌ర్ నేత జ‌క్కంపూడి రామ్మోహ‌న‌రావు మూడు సార్లు గెలిచారు. ద‌లిత నేత బ‌త్తిన సుబ్బారావు క‌డియం లో రెం డు సార్లు గెలిస్తే బూరుగుపూడి, ముమ్మ‌డివ‌రంలో మ‌రో నాలుగు సార్లు గెలుపొందారు. వ‌డ్డి వీర‌భ‌ద్ర‌రావు ఒక్క రెండు సార్లు గెలిచారు. 1983 లో టిడిపి నుండి గెలిచిన గిరిజాల వెంక‌ట స్వామి నాయుడు 1998 లో రాజ‌మండ్రి నుండి లోక్‌స‌భ కు ఎన్నిక‌య్యారు. 2004 లో గెలిచిన త‌రువాత జ‌క్కంపూడి రామ్మోహ‌నరావు వైయ‌స్ హ‌యాంలో మంత్రిగా ప‌ని చేసారు. ఆయ‌న 2009 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌టంతో ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి పోటీ చేసారు. ఆ ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ది విజ‌యం సాధించారు.

12 సార్లు ఎన్నిక‌లు జరిగితే..
1962 లో కోరుకొండ గా ఉన్న సమ‌యంలో ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచింది. 1967 నుండి 2004 వ‌ర‌కు క‌డియం నియోక‌వ‌ర్గంగా ఉంది. అక్క‌డ నాలుగు సార్లు కాంగ్రెస్ గెల‌వ‌గా, టిడిపి అభ్య‌ర్దులు మూడు సార్లు నెగ్గారు. జ‌న‌తా, స్వ‌తంత్ర అభ్య‌ర్దులు ఒక్కోసారి గెలుపొందారు. డీలిమిటేష‌న్ త‌రువాత టిడిపి రెండు సార్లు గెలుపొందింది.

AndhraPradeshElections2019: All about Rajahmundry Rural Constituency

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు
2014 ఎన్నిక‌ల్లో మొత్తంగా ఇక్క‌డ 227694 ఓట్లు ఉండ‌గా, అందులో 167485 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రికి 87510 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన ఆకుల వీర్రాజుకు 69482 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య‌ర్ది గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి 18058 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+