వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లెజెండ్ యాత్ర: బావపై బాలకృష్ణ భారం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజకీయాల విషయంలో నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన గురువారంనాడు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. లెజెండ్ సినిమా విజయ యాత్రలో భాగంగా ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇది తన రాజకీయ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడే విధంగా బాలకృష్ణ చూసుకున్నట్లు కనిపిస్తోంది.

పోటీ విషయంలో మాత్రం బాలకృష్ణ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని బావ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని అంటున్నారు. ఆయన ఎక్కడ కూడా ఫలానా సీటు కోరుకుంటున్నానని చెప్పడం లేదు.

కడప జిల్లాలో కూడా ఆయన గురువారంనాడు పర్యటించారు. లెజెండ్ సినిమా ప్రదర్శిస్తున్న కడపలోని థియేటర్‌ను ఆయన సందర్శించారు. థియేటర్‌లో ఆయన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుపతిలో ఆయన ర్యాలీ నిర్వహించారు.

అభిమానం కురిసింది...

అభిమానం కురిసింది...

లెజెండ్ జైత్రయాత్రలో భాగంగా బాలకృష్ణ గురువారంనాడు తిరుపతికి వచ్చారు. ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ..

రాజకీయాల్లోకి ఎంట్రీ..

ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనడానికి బాలకృష్ణ సిద్ధపడ్డారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం మాత్రమే చేసిన ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు.

శాసనసభకే పోటీ చేస్తా..

శాసనసభకే పోటీ చేస్తా..

బాలకృష్ణను లోకసభకు పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే బాలకృష్ణ మాత్రం శాసనసభకు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఎన్టీఆర్ మాత్రమే లెజెండ్..

ఎన్టీఆర్ మాత్రమే లెజెండ్..

ఎప్పటికీ ఎన్టీ రామారావు మాత్రమే లెజెండ్ అని బాలకృష్ణ అన్నారు. రాజకీయాల్లో తన సత్తా చాటుతానని చెబుతున్నారు.

వ్యూహాత్మకంగా యాత్ర...

వ్యూహాత్మకంగా యాత్ర...

తన రాజకీయాలకు కూడా ఉపయోగపడే విధంగా బాలకృష్ణ లెజెండ్ విజయ యాత్రలో పాల్గొంటున్నట్లు భావిస్తున్నారు.

దండాలు ఇలా...

దండాలు ఇలా...

తన అభిమానులకు, ప్రజలకు తన తిరుపతి యాత్రలో బాలకృష్ణ ఇలా దండం పెడుతూ కనిపించారు. తనను ఆదరించాలని చెప్పకనే చెప్పారు.

హిందూపురం నుంచి పోటీ చేస్తారా..

హిందూపురం నుంచి పోటీ చేస్తారా..

బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో సీమాంధ్ర శానససభకు హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే మాట వినిపిస్తోంది.

ఇక రాజకీయాలే...

ఇక రాజకీయాలే...

బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. దీంతో చంద్రబాబుపై ఒత్తిడి పెరిగిందనే మాట వినిపిస్తోంది.

రాజకీయాల్లో ఆదరిస్తారా...

రాజకీయాల్లో ఆదరిస్తారా...

సినీ రంగంలో బాలకృష్ణను ప్రజలు ఆదరించారు. ఆయన సినిమాలు సూపర్ హిట్ అయిన సందర్భాలున్నాయి. ఆయనను ప్రజలు రాజకీయాల్లో కూడా ఆదరిస్తారా చూడాలి

సన్మానం ఇలా..

సన్మానం ఇలా..

బాలకృష్ణను తిరుపతి యాత్రలో ఇలా సన్మానించారు. ఆయన ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం ఉంది.

English summary
Nandamuri hero and Telugudesam party leader Balakrishna is throwing responsibility on party president Nara Chandrababu Niadu on his contest
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X