వారికి వారే సాటి: హోరెత్తిన మోడీ-కెసిఆర్ సభ

హైదరాబాద్/మెదక్: వారిద్దరూ మాటల మాంత్రికులు. రాజకీయ చతురతలో వారికి వారే సాటి. ఒకరు సార్వత్రిక ఎన్నికల్లో ఒంటి చేత్తో భారతీయ జనతా పార్టీని గెలిపించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. మరొకరేమో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరు సలిపి, ఏర్పడిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వారిద్దరు ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. వారే భారత ప్రధాన నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.

వీరిద్దరూ ఒకే వేదికను పంచుకోవడంతో అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఆనంద పరవశులయ్యారు. వారి ప్రసంగాలు వింటూ కేకలు, చప్పట్లతో హోరెత్తించారు. మెదక్ జిల్లా గజ్వేల్‌కు ఆదివారం వచ్చిన ప్రధాని మోడీ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, రామగుండం ఎఫ్‌సీఐ, జైపూర్ విద్యుత్ కేంద్రం, మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వేలైన్, వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శిలాఫలకాలను రిమోట్ ద్వారా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో మోడీ, కెసిఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ మాటల చాతుర్యాన్ని, చతురోక్తుల్ని పండించి ఒకరిపై ఒకరు, ఎవరి శైలిలో వారు అవ్యాజమైన ప్రేమాభిమానాల్ని చాటుకున్నారు.

తొలిసారిగా తెలంగాణలో అడుగుపెట్టిన మోడీని కెసిఆర్ ప్రశంసలతో ముంచెత్తారు. దేశంలో తొలిసారి అవినీతి రహిత పాలన చూస్తున్నామని, అది మోడీ నాయకత్వంలోనే సాధ్యమైందని కొనియాడారు. కాగా, కెసిఆర్ అభివృద్ధి ప్రణాళికలను అభినందించి మోడీ మరో అడుగు ముందుకేశారు.

మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ
ప్రేమ, అభిమానం, ఆశీస్సులు తమకు చాలనీ టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆయన్ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అవసరమైతే రూ.50 వేల కోట్లో, లక్ష కోట్లో అడగవచ్చని, కానీ తాను అలా ఏదీ అడగనని.. ప్రేమ ఉంటే అదే తమ రాష్ట్భ్రావృద్ధికి దోహదపడుతుందన్నారు.

కెసిఆర్ ఈ విధంగా మాట్లాడి సభలో ఆశ్చర్యాన్ని రేకెత్తించగా.. ప్రధాని కూడా తానేమీ తక్కువ కాదన్నట్లుగా తన ప్రసంగం ద్వారా కెసిఆర్‌పై అవ్యాజమైన అభిమానాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వయసు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమేనని, కానీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందని కితాబునిచ్చారు.

అంతేగాక, కెసిఆర్ కేవలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి సారించకూడదని, ఢిల్లీ కూడా తనదే అని భావించాలని ఛలోక్తిగా మాట్లాడటంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూసాయి.

నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగా సిఎం కెసిఆర్ 7 నిమిషాలు మాట్లాడాల్సి ఉండగా 18 నిమిషాలు ప్రసంగించారు. 15 నిమిషాల పాటు సభలో ప్రసంగించాల్సిన ప్రధాని మోడీ.. తరలివచ్చిన జనాన్ని చూసి రెట్టించిన ఉత్సాహంతో 30 నిమిషాల పాటు వివిధ సంక్షేమ పథకాలపై వివరించడం గమనార్హం.

సిఎం కెసిఆర్ కోరిన ఏ ఒక్క అంశాన్ని కూడా ప్రధాని ప్రస్తావించకపోయినా టిఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం విశ్వాసం వ్యక్తమవుతోంది. ప్రధాని ఎక్కడా కూడా వరాలు కురిపించరని, అక్కడి పరిస్థితులను అవగతం చేసుకుని అందుకు అనుగుణంగా సహకారం అందిస్తారంటూ రాష్ట్ర స్థాయి నాయకులు ఒకరు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. రాష్ట్రానికి అవసరమైన నిధులు ముఖ్యమంత్రి.. కేంద్రం నుంచి పొందగలరని వారు చెప్పుకొచ్చారు.

మోడీ-కెసిఆర్

మోడీ-కెసిఆర్

వారిద్దరూ మాటల మాంత్రికులు. రాజకీయ చతురతలో వారికి వారే సాటి. ఒకరు సార్వత్రిక ఎన్నికల్లో ఒంటి చేత్తో భారతీయ జనతా పార్టీని గెలిపించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.

మోడీ-కెసిఆర్

మోడీ-కెసిఆర్

మరొకరేమో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరు సలిపి, ఏర్పడిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వారిద్దరు ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. వారే భారత ప్రధాన నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.

మోడీ-కెసిఆర్

మోడీ-కెసిఆర్

వీరిద్దరూ ఒకే వేదికను పంచుకోవడంతో అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఆనంద పరవశులయ్యారు. వారి ప్రసంగాలు వింటూ కేకలు, చప్పట్లతో హోరెత్తించారు.

మోడీ-కెసిఆర్

మోడీ-కెసిఆర్

మెదక్ జిల్లా గజ్వేల్‌కు ఆదివారం వచ్చిన ప్రధాని మోడీ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, రామగుండం ఎఫ్‌సీఐ, జైపూర్ విద్యుత్ కేంద్రం, మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వేలైన్, వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శిలాఫలకాలను రిమోట్ ద్వారా ఆవిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+