ఎంత ఆలస్యంగా వెళ్లినా: లోకేష్ నోట చంద్రబాబు 'కష్టం', నవ్వించిన సీఎం

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ తొలిసారి ఒకే వేదికపై కొలువుదీరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. చంద్రబాబు అరవై ఏడేళ్ల వయస్సులో ఇరవై నాలుగేళ్ల కురాడ్రిలా యమస్పీడుతో వెళుతున్నారని వ్యాఖ్యానించారు.

సీఎంలకు 'అజ్ఞాతవాసి' షాక్: డిఫెన్స్‌లో పడ్డారా? పవన్ కళ్యాణ్ రాయబారం, ట్విస్ట్

  ఏపీలో రాష్ట్రపతి.. ప్రతిష్ఠాత్మక ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్ ప్రారంభం | Oneinda Telugu

  తాను ఎంత ఆలస్యంగా ఇంటికి వెళ్లినా తనకంటే ఆలస్యంగా గురువుగారు ఇల్లు చేరుతారని చంద్రబాబును ఉద్దేశించి లోకేష్‌ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల బాగు కోసం ముఖ్యమంత్రికి ఉన్న తాపత్రయం అలాంటిది అన్నారు. చంద్రబాబు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారన్నారు.

  నిర్దేశిత సమయం కంటే ఆలస్యంగా

  నిర్దేశిత సమయం కంటే ఆలస్యంగా

  చంద్రబాబు రామకుప్పం మండలంలో నిర్దేశిత సమయం కంటే అరగంట ఆలస్యంగా వచ్చారు. సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్ ద్వారా కుప్పానికి వెళ్లవలసి ఉండగా, రాత్రి 7 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా బస్సులో కుప్పం చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు లోకేష్, ఇతర మంత్రులు, నాయకులు ఉన్నారు.

   కొందరు తెలివిమీరారంటూ

  కొందరు తెలివిమీరారంటూ

  వారు సభ వద్దకు చేరుకోగానే కార్యకర్తలు, అభిమానులు ఈలలు, కేరింతలతో స్వాగతం పలికారు. ఈ సమయంలో కొందరు నాయకులు వేదిక పైకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కొందరు తెలివి మీరిపోయారని నవ్వుతూ అనడంతో సభలో నవ్వులు విరిశాయి.

  నవ్వులు పూయించిన చంద్రబాబు

  నవ్వులు పూయించిన చంద్రబాబు

  ఓ సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఇంట్లో టీవీలలో పంటల కార్యక్రమాన్ని వీక్షిస్తూ పురుషులు కూడా నచ్చిన వంటను, బిర్యానీని తయారు చేసుకోవచ్చునని నవ్వులు పూయించారు. మరుగుదొడ్డి నిర్మించుకోకుంటే రోజంతా నిరాహార దీక్ష చేస్తానని మరోసారి నవ్వించారు. 1983 జనవరి 9న ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేపడితే సరిగ్గా 35 ఏళ్ల అనంతరం ఇప్పుడు 2018 జనవరి 9 న ననియాలలో జన్మభూమి సభను నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

  బిజీగా చంద్రబాబు

  బిజీగా చంద్రబాబు

  మరోవైపు, మధ్యాహ్నం వరదయ్యపాళెం మండలం చిన్నపాండూరులో చంద్రబాబు మాట్లాడారు. చిన్నపాండూరుతో పాటు ననియా సభలో పాల్గొన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో తీరిక లేకుండా గడిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాప్టర్ ద్వారా రామకుప్పం మండలంలోని ననియాకు చేరుకున్నారు. అక్కడ జన్మభూమి సభలో మాట్లాడారు. సుమారు గంటన్నర సేపు మాట్లాడారు. ఆయన తర్వాత లోకేష్, ఎంపీ శివప్రసాద్ మాట్లాడారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  This is a proud movement for Telugu Desam government as NTR’s first swearing as Chief Minister on the same day in 1983 and now after 35 years we are participating in Janma Bhoomi on the same day”, said Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu. Mr Naidu participated in Janma Bhoomi - Maa Vooru at Nainyala village under Kuppam constituency in Chittoor district on Tuesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి