వాస్తు ప్రకారం ఫ్రిజ్‌పై ఉండకూడని వస్తువులు.. ఉంచితే కష్టమే!

నేటి ఆధునిక కాలంలో 'ఫ్రిజ్' లేని ఇల్లు ఉండదు. ఒకప్పటిలా ఫ్రిజ్ అనేది విలాసం కాదు, ప్రతి ఇంటికీ అత్యవసర వస్తువు. అయితే, మన ఇంట్లోని ప్రతి మూలకూ, వస్తువుకూ వాస్తు శాస్త్రం ఎంత వర్తిస్తుందో.. మనం నిత్యం వాడే ఫ్రిజ్‌కు కూడా అంతే వర్తిస్తుంది. చాలామంది ఫ్రిజ్‌ను అందంగా మార్చాలని దానిపై రకరకాల స్టిక్కర్లు, బొమ్మలు, అయస్కాంతాలు అంటిస్తుంటారు. కానీ, ఫ్రిజ్‌పై ఉంచే చిన్న చిన్న వస్తువులు కూడా మీ ఇంటి ఆర్థిక పరిస్థితిని, మనశ్శాంతిని మార్చేయగలవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇనుము, ఉక్కు వంటి లోహాలతో తయారయ్యే ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటిపైనా రాహువు, శని గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫ్రిజ్ అనేది విద్యుత్ శబ్దాలు, అయస్కాంత తరంగాలతో పనిచేసే పరికరం కాబట్టి, దానిని తప్పుడు దిశలో ఉంచినా లేదా దానిపై అశుభకరమైన వస్తువులు పెట్టినా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వేగంగా వ్యాపిస్తుంది.

Vastu Tips According to principles these items Should Not Be Placed on the Fridge which invites troubles

ఫ్రిజ్‌పై అయస్కాంతాలు పెడుతున్నారా?

ఈ రోజుల్లో విదేశాల నుంచి తెచ్చినవో, లేదా రంగురంగుల ఎమోజీలు,
కార్టూన్ బొమ్మలు ఉన్న అయస్కాంతాలను
ఫ్రిజ్ డోర్‌కు అంటించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.
ఫ్రిజ్‌కు ఉండే సహజ అయస్కాంత శక్తికి తోడు,
మనం అదనంగా రంగుల అయస్కాంతాలను ఉంచినప్పుడు
అది ఆ ప్రాంతంలోని విశ్వ శక్తిని ప్రభావితం చేస్తుంది.
ముఖ్యంగా అశుభకరమైన చిత్రాలు ఉన్న మ్యాగ్నెట్ల వల్ల
రాహువు దోషం చుట్టుముట్టి, వ్యాపారంలో నష్టాలు లేదా అనవసర ఖర్చులు పెరుగుతాయి.

క్రూర జంతువులు, యుద్ధ చిత్రాల స్టిక్కర్లు వద్దు

సింహాలు, చిరుతపులులు, గద్దలు, రాబందులు లేదా
ఆయుధాలతో కూడిన యుద్ధ సన్నివేశాల స్టిక్కర్లను ఫ్రిజ్‌పై అస్సలు అంటించకూడదు.
వి అగ్రెసివ్ తత్వానికి ప్రతీకలు. నిత్యం వీటిని చూడటం వల్ల
కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య
అనవసరమైన కోపతాపాలు, కలహాలు పెరుగుతాయి.

విచారకరమైన లేదా ప్రతికూల ఎమోజీలు

ఈ మధ్య ఏడుస్తున్నట్టు, కోపంగా ఉన్నట్టు,
లేదా వింత ముఖ కవళికలు ఉన్న స్టిక్కర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి.
వంటగది అనేది అన్నపూర్ణా దేవి నివాసముండే పవిత్ర స్థలం.
అక్కడ నెగెటివ్ లేదా విచారకరమైన బొమ్మలను చూడటం వల్ల ఇంట్లో ఉన్నవారి మానసిక స్థితి దెబ్బతింటుంది.
ఇది తెలియకుండానే మనుషులను కుంగుబాటులోకి నెట్టేస్తుంది.

ముళ్ల మొక్కలు, ఎండిపోయిన చెట్ల బొమ్మలు

ఎడారి మొక్కలు, ముళ్ల పొదలు లేదా ఎండిపోయిన వృక్షాల చిత్రాలను
ఫ్రిజ్‌పై ఉంచడం వల్ల ఇంట్లో ఎదుగుదల ఆగిపోతుంది.
ఇది పిల్లల చదువుపై, వారి వృత్తిపరమైన పురోగతిపై
తీవ్ర ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

మిగిలిపోయిన ఆహారాన్ని రోజుల తరబడి ఉంచకండి

చాలా ఇళ్లల్లో వండిన అన్నం, కూరలు మిగిలిపోతే వారాల తరబడి ఫ్రిజ్‌లోనే ఉంచేస్తుంటారు.
హిందూ సంప్రదాయంలో వంటగది అత్యంత పవిత్రమైనది.
ఫ్రిజ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా,
బాక్సుల కొద్దీ కుళ్ళిపోయిన లేదా నిల్వ ఉన్న ఆహార పదార్థాలతో నింపేస్తే
అక్కడ లక్ష్మీదేవి నిలవదు. అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి దరిద్రం చుట్టుముడుతుంది.
కాబట్టి రోజు మార్చి రోజు ఫ్రిజ్‌ను క్లీన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి.

మీ ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం వెల్లివిరియాలంటే వంటగదిలో ఆగ్నేయ మూల
లేదా పడమర దిశలో ఉంచడం చాలా మంచిది.
పొరపాటున కూడా ఫ్రిజ్‌ను ఈశాన్యం లో పెట్టకండి.
ఇది వంశ వృద్ధిని, ఆర్థిక ఎదుగుదలను దెబ్బతీస్తుంది.
మీ ఫ్రిజ్‌పై ఎలాంటి ప్రతికూల బొమ్మలు ఉంచకుండా,
కేవలం 'స్వస్తిక్', 'శుభ లాభ్' లేదా ఓం వంటి పవిత్రమైన చిహ్నాలను
ఉంచుకోవడం వల్ల వంటగదిలో సానుకూల శక్తి పెరిగి,
ధాన్యానికి, ధనానికి ఎలాంటి లోటూ లేకుండా ఇల్లు కళకళలాడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+