రాహుల్‌తో రాష్ట్ర నేతలు: బిజెపిలోకి కన్నా(పిక్చర్స్)

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను మంగళవారం కలిసి కమలం తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ పట్ల తనకు కొంత అసంతృప్తి ఉందని, దీనికితోడు కొందరు వ్యక్తుల మూలంగా కాంగ్రెస్‌లో కొనసాగటం తనకు కుదరటం లేదని ఆయన తనను కలిసిన మీడియాతో చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపంలో దేశానికి సమర్థవంతమైన నాయకత్వం లభించిందని, మోడీ వ్యక్తిత్వం, విధానాలు తనకు ఎంతో నచ్చాయని కన్నా చెప్పారు. బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను కలిసి పార్టీలో చేరాలనే ఆకాంక్షను వ్యక్తం చేశానని, ఆయన పార్టీ నాయకులతో మాట్లాడి అంగీకారం తీసుకున్న తరువాతనే ఢిల్లీకి వచ్చి బిజెపిలో చేరినట్లు ఆయన వెల్లడించారు.

పొన్నాల

పొన్నాల

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం తర్వాత పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా ఢిల్లీలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

పొన్నాల, రఘువీరా

పొన్నాల, రఘువీరా

ఈ సమావేశానికి ఏపి, తెలంగాణ పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ పునరుత్తేజం కోసం సంస్థాగత ఎన్నికలను వాడుకోవాలని రాహుల్ ఈ సమావేశంలో పిలుపునిచ్చారు.

రఘువీరా రెడ్డి

రఘువీరా రెడ్డి

సంస్థాగత ఎన్నిక ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని రాహుల్ కోరారు. ఇందుకు ముళ్లపల్లి రామచంద్రన్ నేతృత్వంలోని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు తెలిపారు.

కన్నా లక్ష్మీనారాయణ

కన్నా లక్ష్మీనారాయణ

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను మంగళవారం కలిసి కమలం తీర్థం పుచ్చుకున్నారు.

అమిత్ షాతో కన్నా

అమిత్ షాతో కన్నా

కాంగ్రెస్‌ పట్ల తనకు కొంత అసంతృప్తి ఉందని, దీనికితోడు కొందరు వ్యక్తుల మూలంగా కాంగ్రెస్‌లో కొనసాగటం తనకు కుదరటం లేదని ఆయన తనను కలిసిన మీడియాతో చెప్పారు.

రాహుల్ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల భేటీ

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం తర్వాత పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా ఢిల్లీలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఏపి, తెలంగాణ పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ పునరుత్తేజం కోసం సంస్థాగత ఎన్నికలను వాడుకోవాలని రాహుల్ ఈ సమావేశంలో పిలుపునిచ్చారు.

సంస్థాగత ఎన్నిక ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఇందుకు ముళ్లపల్లి రామచంద్రన్ నేతృత్వంలోని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ తన పరాజయ పరంపరను ఎదుర్కొంటున్న నేపథ్యంలో భవిష్యత్‌లో సంస్థాగతంగా భారీ మార్పులు ఉంటాయన్న ఊహాగానాలకు రాహుల్ వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయి.

2010నాటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్టీ ఓటమికి సంస్థాగత బలహీనతలే కారణమన్న వ్యాఖ్యలు తరచూ వినపడుతున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో సంస్థాగత ఎన్నిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది వచ్చే ఏడాది పార్టీ నూతన అధ్యక్షుడ్ని ఎన్నికోవడంతో ముగుస్తుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ప్రధాన కార్యదర్శులు, పిసిసిల అధ్యక్షులు, సంస్థాగత ఎన్నికల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+