వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షార్ట్ ఫిల్మ్‌లో హరీష్ రావు: ఒక్క షాట్‌కే డైలాగ్ ఓకే...

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ‘పూడికతీస్తే చెరువుకు ఆరోగ్యం, ఆ మట్టిని పొలాల్లో వేస్తే రైతుకు సౌభాగ్యం.. చేయిచేయి కలిపిరండి.. వట్టిపోయిన చెరువులను పునరుద్ధరించుదాం' అంటూ తెలంగాణ భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు చెప్పిన డైలాగ్‌లు అదరగొట్టాయి. మిషన్‌ కాకతీయపై తీస్తున్న లఘుచిత్రం షూటింగ్‌ సందర్భంగా హరీశ్ రావు డైలాగ్‌లతో రియల్‌ హీరోలా ఆకట్టుకున్నారు. సింగిల్ టేక్‌లో ఓకే అయింది.

మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ దర్శకత్వంలో మిషన్‌ కాకతీయపై మెదక్‌ జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ఆదివారం ఈ లఘు చిత్రం షూటింగ్‌ జరిగింది. మంత్రి తలపాగ చుట్టి, గడ్డపార చేతబట్టి, తవ్వి, పారతో తట్టలో మట్టినింపడం తదితర దృశ్యాలను ఈ సందర్భంగా చిత్రీకరించారు.

Minister Harish Rao in Mission Kakatiya Short Film

ముందుగా చిన్నకోడూరు బురుజువద్ద, తర్వాత పెద్దచెరువు వద్ద మిషన్‌ కాకతీయపై సన్నివేశాలను చిత్రీకరించారు. హరీష్ చెప్పిన డైలాగ్‌ను రసమయి ఫస్ట్ టేక్‌కే ఓకే చేశారు. అనంతరం తట్టలో పోసిన మట్టిని ఎత్తి కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ తలపై పెట్టారు. షూటింగ్‌ అనంతరం హరీశ్ మాట్లాడారు.

మనిషి జీవించడానికి శరీరంలో గుండె ఎంత కీలకమో ప్రతి ఊరికి చెరువు అంతేనన్నారు. రాష్ట్రంలో 2500 కోట్ల రూపాయలతో 4620 చెరువులను పునరుద్ధ్దరించనున్నట్లు చెప్పారు. కూరగాయల సాగులో మొక్కలు నాటే సీడింగ్‌ ప్లాంటర్‌ యంత్రం ద్వారా చేసే మల్చింగ్‌ విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు.

English summary
Minister Harish Rao in Mission Kakatiya Short Film
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X