జగన్, కెసిఆర్‌లకు షాక్: టిడిపి-బిజెపిలదే హవా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల పొత్తు ఆ పార్టీలకు కలసి వస్తోందట. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోకసభలకు గాను టిడిపి-బిజెపి కూటమికి 15, జగన్ పార్టీకి 9, కాంగ్రెసు పార్టీకి ఒక్క సీటు, తెలంగాణలో తెరాసకు 8, కాంగ్రెసుకు58, టిడిపి-బిజెపి కూటమికి 3 సీట్లు దక్కనున్నాయట. పొత్తు ఉభయులకూ లాభం చేకూర్చనుందని ఎన్డీటివి సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
సీమాంధ్రలో పొత్తుతో టిడిపి లబ్ధి పొందనుండగా, తెలంగాణలో బిజెపికి లబ్ధి చేకూరనుంది. ఈమేరకు సీమాంధ్రలో జగన్ పార్టీ,తెలంగాణలో తెరాస నష్టపోనున్నాయని సర్వే లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఇచ్చామని ఘనంగా చాటుకుంటున్న కాంగ్రెస్‌కి ఇరుప్రాంతాల్లోనూ ఉభయభ్రష్టత్వమేనని సర్వే చాటుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిల్లో సీమాంధ్ర, తెలంగాణల్లోని లోక్‌సభ స్థానాల్లో సర్వే నిర్వహించిన ఎన్డీటీవీ తాజాగా ఏప్రిల్ మొదటి వారంలో మరోసారి సర్వే నిర్వహించింది.

ఫిబ్రవరి నుంచి తాజా సర్వే వరకు ఇరుప్రాంతాల్లో ఫలితాల సరళి ఇలా ఉంది.... లోకసభ ఎన్నికల్లో ఎన్డీయే విజయం ఖాయమని ఎన్డీటివి సర్వే ద్వారా వెల్లడైంది. ఈ కూటమి మొత్తం 275 సీట్లు సాధిస్తుందని తేల్చింది. ఈ సర్వే ప్రకారం.. అతిపెద్ద పార్టీగా 226 సీట్లతో బిజెపి నిలుస్తుంది. యూపిఏ 111 సీట్లతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌కు 92 సీట్లు వస్తాయి.
ఇక ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. 2009లో 26.5 శాతం ఓట్లు దక్కించుకున్న బిజెపి... ఈసారి 34.5 శాతం సాధిస్తుంది. ఇదే సంస్థ ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో బిజెపి 30.1 శాతం ఓట్లను దక్కించుకుంటుందని వెల్లడైంది. మార్చిలో జరిపిన సర్వేలో 32.9 శాతం సాధిస్తుందని తేల్చింది. 2009 ఎన్నికల్లో 33.2 శాతం ఓట్లను రాబట్టుకున్న కాంగ్రెస్‌కు ఈసారి 25.6 శాతానికి మించి రావని తాజా సర్వే ద్వారా వెల్లడైంది. ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో.. కాంగ్రెస్ 26.8 శాతం ఓట్లు సాధిస్తుందని.. మార్చిలో జరిపిన సర్వేలో.. 26.9 శాతం దక్కించుకుంటుందని తేలింది.












Click it and Unblock the Notifications