వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలిటిక్స్‌కు దెబ్బ: పవన్ కల్యాణ్ సర్దార్‌పై కుట్ర?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సర్దార్ గబ్బర్ సింగ్‌ సినిమాపై నెగిటివ్ టాక్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలపై దెబ్బ వేస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో తన స్టార్ డమ్‌తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పాలనే ఆయన ఆశలపై దెబ్బ పడిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై ఎప్పుడూ లేని విధంగా, ఇతర మాస్ హీరోల సినిమాల విషయంలో జరగని విధంగా నెగెటివ్ టాక్ వచ్చేసింది. నిజానికి, భారీ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సినిమాకు రషెస్ లేకపోయినా, విఫలమైనా వారం, పది రోజుల దాకా అది బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు.

Also Read:'సర్దార్ గబ్బర్ సింగ్' ..గట్స్ అండ్ గన్స్ రివ్యూ

మాస్ హీరోల విషయంలో నెగెటివ్‌ టాక్‌ను ప్రచారం చేయడానికి కూడా మీడియా ముందుకు రాదు. కానీ, పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. మొదటి ఆట నుంచే ఆ సినిమాపై నెగటివ్ టాక్ ప్రారంభమైంది. అలా కావడం వెనక రాజకీయపరమైన కుట్ర ఏదైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Negative talk on Sardar Gabbar Singh hampers his political future?

కథ, స్క్రీన్‌ప్లే ఆయన రాయడం, ఆ సినిమాకు అంతా తానే అయిపోవడం కూడా పవన్ కల్యాణ్‌పై ఫలితం ప్రభావం ఎక్కువగా పడిందని చెప్పాలి. తన హీరోయిజం ద్వారా, తన మాస్ అపీల్ ద్వారా, తన పంచ్ డైలాగుల ద్వారా సినిమా హిట్టవుతుందని బహుశా పవన్ కల్యాణ్ కూడా భావించి ఉంటాడు. కానీ, ఆశించిన ఫలితాన్ని అది సాధించలేకపోయింది.

దాంతో సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద యెత్తున ప్రచారం సాగింది. తీరిక ఉంటే రామకోటి రాసుకోండి గానీ కథలు, స్క్రీన్‌ప్లేలు అంటూ పరువు తీయవద్దని కూడా కామెంట్లు వచ్చాయి. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందంటూ కొందరు ప్రముఖులు ట్వీట్టర్లలో కామెంట్లు కూడా చేశారు.

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గొడవ: దాడి, ఒకరి మృతిసర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గొడవ: దాడి, ఒకరి మృతి

గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి సినిమాల ద్వారా విజయానికి మారుపేరుగా మారిన పవన్ కల్యాణ్‌కు సర్దార్ గబ్బర్ సింగ్ పెద్ద దెబ్బగానే చెప్పాలి. సినిమాలకు, రాజకీయాలకు సంబంధం లేదని, సినిమాలను వినోదాన్నిచ్చే కళగానే చూస్తానని పవన్ కల్యాణ్ అన్నారు.

కానీ, ఆయన మాటలను పట్టించుకుని అలా అన్వయించేవారు ఉండరనే చెప్పాలి. ఆయన సినిమా విజయానికి లేదా అపజయానికి ఆయన రాజకీయాలకు ముడిపెట్టి చూడడం అనేది అనుకోకుండానే జరిగిపోతోంది. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలోనూ అలానే జరుగుతోంది.

ఏమైనా, రాజకీయాలపై సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫలితం ప్రభావం చూపుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం. పవన్ కల్యాణ్‌కు ఎవరికీ లేనంతగా అభిమానులున్నారు. ఆయన మాట కోసం తపించే అభిమానులు కూడా ఉన్నారు. అందువల్ల వచ్చే రాజకీయాలను ఆయన ఏ మలుపు తిప్పుతారో చూడాల్సిందే.

English summary
Question is raised that will Jana Sena chief and power star Pawan Kalyan Sardar Gabbar Singh film affects his political future?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X