పవన్ జట్టుపై చిరుకు కోపమొచ్చిన వేళ.. (పిక్చర్స్)
కర్నూలు: చిరంజీవి నేతృత్వంలో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ బస్సుయాత్ర గురువారంతో ముగిసింది. వారం రోజుల పాటు ఈ బస్సుయాత్ర పదమూడు జిల్లాల్లో జరిగింది. బస్సు యాత్ర విజయవంతమైందని ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి, సీమాంధ్ర ప్రచార కమిటీ అధ్యక్షులు చిరంజీవి చెప్పారు. కర్నూలులో వారు మాట్లాడారు.
అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఏప్రిల్ మొదటి వారంలో అభ్యర్థులను ప్రకటించి బిఫారాలు ఇచ్చేందుకు అధిష్ఠానం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. పార్టీలో పదవులు అనుభవించిన నేతలు రాత్రికి రాత్రే గోడదూకి పోయారన్నారు. చిరంజీవి మాట్లాడుతూ బస్సు యాత్రకు ప్రతి చోటా అపూర్వ స్పందన లభించిందన్నారు.
ఇప్పటివరకు పార్టీ నుంచి వెళ్లిపోయిన వారంతా చెత్త, కళేబరాలతో సమానమన్నారు. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకుంటామని చెప్పారు. ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తొలుత కర్నూలులో ర్యాలీ జరిపి, అనంతరం కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు.

చిరంజీవి
మోసపూరిత వాగ్దానాలతో మభ్యపెడుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఓడించాలని అనంతపురం ఆర్ట్స్‌కళాశాల మైదానంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రఘువీరారెడ్డి, చిరంజీవి మాట్లాడుతూ అన్నారు.

చిరంజీవి
నరహంతకులు, భూకబ్జాదారులు, అవినీతిపరులు తెలుగుదేశం పార్టీలో చేరి పసుపు కండువాలు కప్పుకోగానే పవిత్రులైపోయారా..? అని చంద్రబాబు నాయుడును ఆగ్రహంతో చిరంజీవి నిలదీశారు. యలమంచిలి రాజు, తిరుపతి వెంకటరమణలు అవినీతిపరులని, జెసి దివాకర్ రెడ్డి నరహంతకుడని, అధికారంలోకి వస్తే వారిని జైలులో పెట్టిస్తానని ఇదే అనంతపురంలో చంద్రబాబు ఆందోళన చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.

చిరంజీవి
కర్నూలులో మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడేమి సమాధానం చెబుతారని చంద్రబాబును చిరు ప్రశ్నించారు.

చిరంజీవి
అనంతపురం జిల్లాలో చిరంజీవి భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు గుప్పిస్తుండగా.. ఓ అభిమాని పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయగా... చిరంజీవి షటప్ అంటూ ఆగ్రహించారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications