డొనేషన్: బాబు, లోకేష్ తీసుకున్నారిలా..(పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. అదే సమయంలో పార్టీ వ్యవహారాల్లో ఆయన తనయుడు నారా లోకేష్ తీరిక లేకుండా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి ఎవరో ఒకరు విరాళాలు ఇస్తూనే ఉన్నారు. వాటిని చెక్కుల రూపంలో లోకేష్ స్వీకరిస్తున్నారు.

చంద్రబాబు నాయుడిని సోమవారం ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కలిశారు. ఇదిలావుంటే, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అందించారు. అంతేకాకుండా, చంద్రబాబు వివిధ రంగాలకు చెందినవారిని సోమవారం కలుసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ అభిమానులు పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి 72 వేల 345 రూపాయలు విరాళంగా ఇచ్చారు. నారా లోకేష్ చెక్కులను వారి నుంచి అందుకున్నారు. మహానాడు నిధికి వావిలాల సరళా దేవి ఇచ్చిన రూ. 25 వేల విరాళాన్ని చెక్కు రూపంలో నారా లోకేష్ స్వీకరించారు.

అనిల్ అంబానీతో చంద్రబాబు

అనిల్ అంబానీతో చంద్రబాబు

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సోమవారం సమావేశమయ్యారు.

సమావేశంలో అనిల్ అంబానీ

సమావేశంలో అనిల్ అంబానీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంపై చంద్రబాబు నాయుడు అనిల్ అంబానీతో విస్తృతంగా చర్చించారు.

అనురాధ చెక్కు

అనురాధ చెక్కు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం గద్దె అనురాధ చంద్రబాబుకు లక్షల రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు.

సమస్యలు విన్న చంద్రబాబు

సమస్యలు విన్న చంద్రబాబు

ఓ పౌరుడి సమస్యలను వింటూ చంద్రబాబు ఇలా కనిపించారు. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను ఆయన సోమవారంనాడు కలుసుకున్నారు.

మహిళలతో చంద్రబాబు నాయుడు...

మహిళలతో చంద్రబాబు నాయుడు...

తనను కలవడానికి వచ్చిన మహిళలతో చంద్రబాబు ఇలా కనిపించారు. వారు చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్నారు.

చిన్నారిని ఎత్తుకున్న బాబు

చిన్నారిని ఎత్తుకున్న బాబు

తన వద్దకు వచ్చిన ప్రజలను చంద్రబాబు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ చిన్నారిని చంకన ఎత్తుకుని ఇలా కనిపించారు.

అభిమానుల విరాళం

అభిమానుల విరాళం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన టిడిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి వావిలా సరళాదేవి రూ.25 వేలు, తిరుమలకు చెందిన కొండేటి వేణుగోపాల నాయుడు రూ. 10 వేలు, అత్తిలికి చెందిన బుద్ధన శ్రీనివాసులు రూ. 12,345,77 నారా లోకేష్‌కు అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+