రాష్ట్రపతితో బాబు ఒక్కరే: టీ నేతలు దూరం (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజభవన్‌లో ఏర్పాటు చేసిన విందులో మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ ప్రజా ప్రతినిధులు దూరంగా ఉండడానికి ప్రయత్నించారు. కాగా, చంద్రబాబు రాష్ట్రపతితో దాదాపు అర గంటపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు.

అనారోగ్య కారణాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గవర్నర్ ఇచ్చిన విందుకు దూరంగా ఉన్నారు. ఆయనకు 101 డిగ్రీల జ్వరం కాస్తున్నదని సీఎంవో వర్గాలు తెలిపాయి. దానివల్ల అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని, వైద్యుల సూచన మేరకు ఇంట్లో పూర్తిగా విశ్రాంతి తీసుకొంటున్నారని, సందర్శకులను సైతం అనుమతించడం లేదని వెల్లడించాయి.

నోటుకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాల్లో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు పరస్పరం విమర్శలు చేసుకోవడం, ఎమ్మెల్యేకు ముడుపుల కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్‌ రావడం వంటి పరిణామాల నేపథ్యంలో విందుకు హాజరైతే చంద్రబాబుతో గవర్నర్‌ చొరవ తీసుకొని, కరచాలనం చేయిస్తే తెలంగాణ తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతాయనే ఉద్దేశంతోనే కెసిఆర్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గవర్నర్ విందు..

గవర్నర్ విందు..

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ మంగళవారం సాయంత్రం విందు ఇచ్చారు. వర్షాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి గౌరవార్థం మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు.

చంద్రబాబు హాజరు

చంద్రబాబు హాజరు

గవర్నర్ విందు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దూరంగా ఉన్నారు. విందు సమయంలో చంద్రబాబుకు గవర్నర్‌ దంపతులు సాదరంగా స్వాగతం పలికారు.

బాబుకు దూరంగా టీ ప్రజాప్రతినిధులు

బాబుకు దూరంగా టీ ప్రజాప్రతినిధులు

విందు కార్యక్రమంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు చంద్రబాబుతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చంద్రబాబుకు దూరంగా పోయి, స్పీకర్‌ మధుసూదనాచారి వద్ద కూర్చున్నారు.

పలువురు ప్రముఖులు హాజరు..

పలువురు ప్రముఖులు హాజరు..

విందుకు ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బీ భోసాలే, తోపాటు ఇరు రాష్ర్టాల ఉప సీఎంలు, శాసనమండళ్ల చైర్మన్లు, సీఎస్‌లు, ప్రముఖ క్రీడాకారుడు గోపీచంద్‌ తదితరులు హాజరయ్యారు.

రాష్ట్రపతితో గవర్నర్ భేటీ

రాష్ట్రపతితో గవర్నర్ భేటీ



విందుకు ముందు గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌, రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల్లోని పరిస్థితిని ఈ సమయంలో గవర్నర్‌ ఆయనకు వివరించారు.

రాష్ట్రపతికి గవర్నర్ దంపతులు స్వాగతం

రాష్ట్రపతికి గవర్నర్ దంపతులు స్వాగతం

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ దంపతులు ఘన స్వాగతం పలికారు. ఆయనను లోనికి తోడ్కోని వచ్చారు.

ఇలా ఫోటోలో..

ఇలా ఫోటోలో..

గవర్నర్ నరసింహన్ దంపతులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రత్యేకంగా ఫొటో తీయించుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ విందు ఇచ్చారు.

రాజభవన్‌లో సందడి

రాజభవన్‌లో సందడి

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో సందడి చోటు చేసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రముఖులు పలువురు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+