పోలవరం: పార్టీలకు ఓట్లు కురిపించే అస్త్రం, అసలు వివాదమేమిటీ?

Posted By:
Subscribe to Oneindia Telugu
  Polavaram Project Politics In Ap | Oneindia Telugu

  అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. 2019 ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని ఇవ్వాలని అధికార టిడిపి ప్లాన్ చేస్తోంది. అయితే ఇటీవల చోటు చేసుకొంటున్న పరిణామాలతో అధికార పార్టీ నిర్ణయాలు ఏ మేరకు ఫలిస్తాయోననే ఆందోళన కూడ లేకపోలేదు. అసలు వివాదమేమిటీ? ఎందుకు ఏపీలో పోలవరం ప్రాజెక్టు విషయమై పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతోందో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

  పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలను తీసుకొంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం పనుల్లో వేగం అనుకొన్నంతగా లేదని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

  అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చొరవ కారణంగానే ప్రాజెక్టు పనుల్లో ఈ మేరకైనా పురోగతి ఉందంటున్నారు అధికార పార్టీ నేతలు . పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సహకరిస్తామంటూనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల టిడిపి నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది

  రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారిన పోలవరం ప్రాజెక్టు

  రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారిన పోలవరం ప్రాజెక్టు

  ఏపీలో పోలవరం ప్రాజెక్టు రాజకీయ పార్టీలకు ఓట్లను తెచ్చిపెట్టే ప్రధాన అస్త్రంగా మారింది. ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రాజెక్టును కనీసం ఎన్నికల నాటికి పూర్తి చేసి ఓట్లు అడగాలనేది టిడిపి లక్ష్యంగా కన్పిస్తోంది. కానీ, విపక్షాలు ఈ ప్రాజెక్టుకు పదే పదే అడ్డుపడుతున్నాయని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. మిత్రపక్షంగా ఉన్న బిజెపి నేతల తీరు పట్ల కూడ టిడిపి నాయకత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో కొంత అసంతృప్తితో ఉంది.

  భారీగా పెరగిన పోలవరం వ్యయం

  భారీగా పెరగిన పోలవరం వ్యయం

  పోలవరం ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరిగింది.ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే రూ.54 వేల కోట్ల రూపాయలు అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తోంది. అసలు మొదట్లో ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం పది వేల కోట్ల రూపాయల లోపే ఉంది. ముంపు ప్రాంతాల్లో భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు రూ.2900 కోట్ల రూపాయలు అంచనా ఖర్చు వేశారు.

  రాజకీయ విమర్శలు

  రాజకీయ విమర్శలు

  పోలవరం ప్రాజెక్ట్ రాజకీయ ప్రాధాన్యత అంశంగా మారడంతో అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. పనులు నెమ్మదించడం దగ్గర్నుంచి అంచనాల పెంపు వరకూ అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి చర్చనీయాంశాలుగా మారాయి. అంతేకాదు నిర్వాసితులకు పరిహరం చెల్లింపు ఇంకా సమస్యగానే ఉంది. మరో వైపు పనులు నెమ్మదిగా సాగడం వంటి అంశాలపై విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.

  కాంట్రాక్టర్ల మార్పు విషయమై ఒప్పుకోని కేంద్రం

  కాంట్రాక్టర్ల మార్పు విషయమై ఒప్పుకోని కేంద్రం

  పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌ను పద్నాలుగు శాతం తక్కువకు ట్రాన్స్ ట్రాయ్ సంస్థ దక్కించుకుంది. అంత తక్కువ దరకు ప్రాజెక్ట్ పూర్తి చేయడం సాధ్యం కాదని తేలిందంటున్నారు నిపుణులు. అంచనాలు సవరించే అవకాశాలు కూడా లేకపోవడంతో పనులు చేయడం మానేసింది.కొద్ది రోజుల పాటు పనులు నిలిచిపోయాయి. చేసేదేమీ లేక ప్రభుత్వం సబ్ కాంట్రాక్టర్లను నియమించి .. మట్టి పని.. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం లాంటి పనులను చేయించింది. కాంట్రాక్టర్‌ను మార్చాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. అయితే కాంట్రాక్టర్‌ను మార్చితే అంచనాలు పెంచాలన్న ఉద్దేశంతో కేంద్రం కుదరదని స్పష్టం చేసింది. అసలు పనే చేయని కాంట్రాక్టర్‌ను మార్చకుండా... ప్రాజెక్ట్ ను ఎలా పూర్తి చేస్తామని... కేంద్రం ఏం చెబుతుందో అర్థం కాక రాష్ట్రం తలపట్టుకుంటోంది.

  15 రోజుల్లో సమీక్షిస్తానని గడ్కరీ హమీ

  15 రోజుల్లో సమీక్షిస్తానని గడ్కరీ హమీ

  పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై మూడు రోజుల క్రితం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు, ఇతర నీటి పారుదల శాఖాధికారులు సమావేశమయ్యారు. అంతేకాదు ఆ సమయంలో దక్షిణకొరియాలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫోన్‌లో నితిన్ గడ్కరీతో మాట్లాడారు. అయితే ప్రతి 15 రోజులకు ఓ సారి ప్రాజెక్టు పనులను సమీక్షించనున్నట్టు మంత్రి గడ్కరీ ప్రకటించారు. పనులు పూర్తి కాగానే నిధులు విడుదల చేస్తామని మంత్రి హమీ ఇచ్చారు.

  పోలవరం నీరివ్వడం సాద్యమేనా

  పోలవరం నీరివ్వడం సాద్యమేనా


  2019 ఎన్నికల నాటికైనా పోలవరం ప్రాజెక్టు నీరివ్వాలని టిడిపి లక్ష్యంగా పెట్టుకొంది. స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌తో పాటు దిగువన కాఫర్ డ్యామ్ కడితే తప్ప గ్రావిటీ ద్వారా నీళ్లు వదలడం సాధ్యం కాదు. ఈ పనులన్నీ పూర్తికావడం ఇప్పుడున్న వేగంతోనే అయితే నిర్ణీత కాలానికి అసాధ్యం. అయితే పనుల్లో వేగాన్ని పెంచడం వల్ల నీటిని ఇవ్వడం సాధ్యమనే అభిప్రాయంతో అధికార టిడిపి ఉంది.అయితే టిడిపి ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతోందో చూడాలి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  polavaram project

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి