సర్వే: అసెంబ్లీకి కెసిఆర్, లోకసభకు కాంగ్రెసు

Survey: YS Jagan vs Chandrababu in Seemandhra
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని బలాబలాలపై, విజయావకాశాలపై ఉత్కంఠ నెలకొన్న స్థితిలో ఓ సర్వే దాన్ని కాస్తా తగ్గించే ప్రయత్నం చేసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో, సీమాంధ్రలో ఏయే పార్టీలకు విజయావకాశాలున్నాయనే సందేహాలను తీరుస్తూ సిఎన్ఎన్ - లోక్‌నీతి, సిఎస్‌డిఎస్ ఓ సర్వే నిర్వహించి, ఫలితాలను వెల్లడించింది.

సర్వే ఫలితాల ప్రకారం - సీమాంధ్ర ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటాపోటీగా నిలుస్తాయి. సమవుజ్జీలుగా నిలిచి పోటీ పడుతాయి.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గాలి వీస్తుంది. లోక్‌సభ ఎన్నికలకు మాత్రం తెలంగాణ ప్రజల మొగ్గు కాంగ్రెస్‌ వైపు ఉంటుందని తేలింది.

సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 11 నుంచి 17 లోసకభ స్థానాలు దక్కే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ 10-16 సీట్లతో రెండో స్థానంలో నిలుస్తుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు రెండింటిలోనూ 45 శాతం ఓట్లు పడే వీలుంది. తెలుగుదేశం పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో 33%, అసెంబ్లీ ఎన్నికల్లో 39% ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌కు లోకసభ ఎన్నికల్లో 16 శాతం, శాసనసభ ఎన్నికల్లో 12 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. కాగా, బిజెపికి లోక్‌సభ ఎన్నికల్లో 3 శాతం ఓట్లు, అసెంబ్లీ ఎన్నికల్లో శాతం ఓట్లు పడుతాయని అంచనా. సీమాంధ్రలో 25 లోకసభ స్థానాలున్నాయి.

లోకసభ ఎన్నికల్లో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) లోకసభ ఎన్నికల్లో పోటీ పడి 6 నుంచి 12 సీట్లు దక్కే అవకాశం ఉంది. తెలంగాణలో 17 లోకసభ స్థానాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు 42 శాతం ఓట్లు పడుతాయి. కాంగ్రెసుకు 20 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి 11 శాతం ఓట్లు, బిజెపికి 6 శాతం, వైయస్సార్ కాంగ్రెసుకు 2 శాతం ఓట్లు పడుతాయని అంచనా.

లోకసభ ఎన్నికల విషయానికి వస్తే, తెలంగాణలో కాంగ్రెసుదే పైచేయిగా ఉంది. కాంగ్రెసుకు 32 శాతం, తెరాసకు 26 శాతం ఓట్లు పోలవుతాయని అంచనా. తెలుగుదేశం పార్టీకి 11 శాతం, బిజెపికి 10 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 2 శాతం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఒక శాతం ఓట్లు పోలవుతాయి.

సీమాంధ్రలో 96 శాతం మంది రాష్ట్ర విభజనను వ్యతిరేకించగా, తెలంగాణలో 96 శాతం మంది రాష్ట్ర ఏర్పాటును సమర్థించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు సరిగా వ్యవహరించిందని 42 శాతం మంది ప్రజలు అభిప్రాయపడగా, అత్యంత దారుణంగా వ్యవహరించిందని 63 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+