వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: ఢిల్లీ ఆఖరి క్షణం హీట్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకునే నేపథ్యంలో గురువారం ఉదయం తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ అనుకూల, వ్యతిరేక నాయకుల చివరి క్షణం ప్రయత్నాలతో ఢిల్లీ వేడెక్కింది. తెలంగాణ నాయకులు, తెలంగాణ జెఎసి నేతలు ఒకవైపు, సీమాంద్ర నాయకులు మరో వైపు మోహరించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోలేమని నిర్ణయానికి వచ్చిన సీమాంధ్ర నాయకులు కనీసం హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి, రాయల తెలంగాణను ఆమోదింపజేయడానికి ప్రయత్నాలు చేశారు.

మరోవైపు, రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు, తెలంగాణ జెఎసి నాయకులు ప్రయత్నాలు సాగించారు. పది జిల్లాల తెలంగాణ రాష్ట్రానికే వివిధ పార్టీలను ఒప్పించేందుకు తెలంగాణ జెఎసి నాయకులు ప్రయత్నించగా, అధిష్టానాన్నీ కేంద్ర ప్రభుత్వాన్నీ ఒప్పించేందుకు కాంగ్రెసు తెలంగాణ నేతలు ప్రయత్నాలు సాగించారు.

కేంద్ర మంత్రి వర్గం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే వరకు ఇరు ప్రాంతాల నేతలు తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. మంత్రి వర్గ సమావేశం దాదాపు మూడు గంటలు జరిగింది. అది ముగిసే వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. రాయల తెలంగాణ ప్రతిపాదన కొత్తగా ముందుకు రావడం ఆ ఉత్కంఠను మరింత పెంచింది. చివరి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పడంతో ఉత్కంఠకు తెర పడింది.

జైరాంతో దిగ్విజయ్ సింగ్ భేటీ

జైరాంతో దిగ్విజయ్ సింగ్ భేటీ

మంత్రివర్గ సమావేశానికి ముందు రాయల తెలంగాణకు జివోఎం నివేదిక రూపొందించి, క్యాబినెట్ నోట్ తయారు చేసిందనే వార్తలు వెలువడిన నేపథ్యంలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ జివోఎం సభ్యుడు జైరాం రమేష్‌తో సమావేశమయ్యారు.

అజిత్ సింగ్‌తో తెలంగాణ జెఎసి నేతలు..

అజిత్ సింగ్‌తో తెలంగాణ జెఎసి నేతలు..

మంత్రి వర్గ సమావేశానికి ముందు తెలంగాణ జెఎసి నేతలు కోదండరామ్, తదితరులు ఆర్ఎల్‌డి నేత, కేంద్ర మంత్రి అజిత్ సింగ్‌ను కలిసి పది జిల్లాల తెలంగాణకు మద్దతు ఇవ్వాలని కోరారు.

అజిత్ సింగ్ స్పష్టీకరణ

అజిత్ సింగ్ స్పష్టీకరణ

తాము పది జిల్లాల తెలంగాణనే అనుకూలంగా ఉన్నామని, 2014 ఎన్నికల లోపు తెలంగాణ ఏర్పడుతుందని అజిత్ సింగ్ చెప్పారు.

తెరాస నేతలు వివేక్, వినోద్ కుమార్..

తెరాస నేతలు వివేక్, వినోద్ కుమార్..

రాయల తెలంగాణకు వ్యతిరేకంగా ఢిల్లీలో చివరి ప్రయత్నాలు సాగించాడనికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు జి. వివేక్, వినోద్ కుమార్..

టిడిపి నేతల ఆగ్రహం..

టిడిపి నేతల ఆగ్రహం..

రాష్ట్ర విభజన తీరుపై మీడియా సమావేశంలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు శివప్రసాద్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విహెచ్ వాదన..

విహెచ్ వాదన..

పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని మంత్రి వర్గ సమావేశంలో పట్టుబట్టాలని తాము కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని కోరినట్లు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు మీడియా సమావేశంలో చెప్పారు.

విహెచ్‌తో తెలంగాణ జెఎసి నేతలు..

విహెచ్‌తో తెలంగాణ జెఎసి నేతలు..

తెలంగాణ జెఎసి నేతలు ఢిల్లీలో మకాం వేసి అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలిసి పది జిల్లాల తెలంగాణకు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేశారు. వారు కాంగ్రెసు ఎంపి వి. హనుమంతరావును కూడా కలిశారు.

తెలంగాణ ఎంపిలు

తెలంగాణ ఎంపిలు

తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రాపోల్ ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిలతో తెలంగాణ జెఎసి నేతలు ఇలా..

తెలంగాణ కాంగ్రెసు నేతలు ఇలా...

తెలంగాణ కాంగ్రెసు నేతలు ఇలా...

పది జిల్లాల తెలంగాణ కోసం ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఇలా కనిపించారు. వారు గురువారంనాడు మంత్రి వర్గ సమావేశానికి ముందు సోనియా గాంధీని, మన్మోహన్ సింగ్‌ను కలిశారు

తెలంగాణపై మా డిమాండ్..

తెలంగాణపై మా డిమాండ్..

తెలంగాణపై మా డిమాండ్ ఇదంటూ జివోఎంకు సమర్పించిన నివేదికను తెలంగాణ జెఎసి నేత కోదండరామ్ ఇలా ఢిల్లీలో ప్రదర్శించారు.

తెర దింపన షిండే..

తెర దింపన షిండే..

తెలంగాణపై ఉదయమంతా నెలకొన్న ఉత్కంఠకు మంత్రివర్గ నిర్ణయాన్ని ప్రకటించడం ద్వారా తెర దింపారు. పది జిల్లాల తెలంగాణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటూ వివరాలను వెల్లడించారు.

English summary
With the efforts od Seemandhra leaders and Telangana leaders on Telangana issue New Delhi has witnessed political heat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X