Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజ్యసభతో చెక్: జగన్‌పై బాబు 'బిజినెస్‌మెన్' ప్లాన్

హైదరాబాద్/విజయవాడ: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాకిచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారా? అంటే అవుననే అంటున్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో సరికొత్త ప్రణాళికతో జగన్‌కు చెక్ పెట్టాలని టిడిపి నేతలు యోచిస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు కానున్నాయి. ఏపీలో పార్టీలపరంగా బలం చూసుకుంటే.. మూడు టిడిపికి, ఒకటి వైసిపికి దక్కే అవకాశాలున్నాయి.

మూడింట రెండు టిడిపికి, పొత్తులో భాగంగా ఒకటికి బిజెపికి చంద్రబాబు ఇస్తారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇక, వైసిపి తరఫున విజయ సాయి రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. విజయ సాయికి దాదాపు ఖాయమైనందునే మైసూరా రెడ్డి వంటి నేతలు అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపించాయి.

ఇదిలా ఉండగా, జగన్‌‍కు షాకిచ్చే ప్రయత్నంలో భాగంగా ఓ బిజినెస్‌మెన్‌ను బరిలోకి దించి చెక్ చెప్పాలని భావిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ్యాపారవేత్తని బరిలోకి దించితే.. వైసిపికి చెందిన రెబల్ ఎమ్మెల్యేలను, అసంతృప్త ఎమ్మెల్యేలను ఆయన లాక్కునే ప్రయత్నాలు చేస్తారనే అభిప్రాయం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీలో రాజ్యసభ సభ్యుడిగా గెలిచేందుకు 42 మంది ఎమ్మెల్యేల మద్దతును తొలి ప్రాధాన్యతగా పొందవలసి ఉంటుంది. బిజెపి - టిడిపికి 106 మంది సభ్యులు ఉన్నారు. ఇటీవలే 8 మంది ఎమ్మెల్యేలు వైసిపి నుంచి చేరారు. దీంతో ఈ కూటమి 3 స్థానాలు దక్కించుకుంటుంది.

Telugudesam to field ‘businessman’, deprive YSRC Rajya Sabha seat

వైసిపి నుంచి 2014 నుంచి గెలిచింది 67 మంది అయితే, ఇటీవల ఎనిమిది మంది టిడిపిలో చేరారు. పార్టీలు తమ తమ బలాబలాలను చూసుకొని బరిలోకి దిగుతాయి. తద్వారా ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నికవుతుంటారు.

అయితే, తెలుగుదేశం పార్టీ మాత్రం సాధ్యమైనంత వరకు వైసిపి ఎమ్మెల్యేలను తమ వైపుకు లాక్కోవాలని ప్రయత్నాలు చేస్తోందట. అదీ రాజ్యసభ ఎన్నికల్లోపే సాధ్యమైనంత ఎక్కువ మందిని చేర్చుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది.

టిడిపి - బిజెపి సభ్యులు 106 మంది, ఇటీవల చేరిన వారు 8 మందితో పాటు మరికొందరిని తమ వైపుకు సదరు వ్యాపారవేత్త ద్వారా లాక్కొని సులభంగా మూడు సీట్లు గెలుచుకోవాలనుకుంటోందని తెలుస్తోంది. అంతేకాదు, నాలుగో స్థానం పైన కూడా కన్నేసిందట.

టిడిపి సీనియర్ నేత సీఎం రమేష్ మాట్లాడుతూ... రాజ్యసభ ఎన్నికల వరకు వైసిపి నుంచి మరో 30 మంది ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారని జోస్యం చెబుతున్నారు. వైయస్ జగన్ పట్ల వారు చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.

వైసిపి నుంచి విజయ సాయి రెడ్డిని నిలబెడతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసిపి అభ్యర్థి కంటే 'బలమైన' అభ్యర్థిని బరిలోకి దించుతామని సీఎం రమేష్ చెబుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తద్వారా విజయ సాయి రెడ్డిని కూడా ఓడిస్తామని చెబుతున్నారట.

అయితే, ఇక్కడో మెలిక కూడా ఉందని అంటున్నారు. జగన్ పట్ల అసంతృప్తితో ఉన్న వైసిపి ఎమ్మెల్యేలను సదరు 'బిజినెస్‌మెన్' ద్వారా తమవైపుకు టిడిపి రప్పించాలనుకుంటుంది. అతనికి ఓటు వేయాలని చెబుతుంది. అంతేకాదు, వారు అతనికి ఓటు వేసినప్పటికీ.. చట్టపరంగా, సాంకేతికంగా వైసిపిలోనే ఉండవచ్చునంటున్నారు.

ఆ కోణం నుంచి టిడిపి.. వైసిపి ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విప్ జారీ అవకాశం లేదని అంటున్నారు. కచ్చితంగా ఓ అభ్యర్థిని సూచించి ఓటు వేయమని సూచించలేరని అంటున్నారు. దీనిని టిడిపి, తాము నిలబెట్టే వ్యాపారవేత్త ద్వారా క్యాష్ చేసుకోవాలనుకుంటోందని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+