కెసిఆర్ వ్యూహం: అప్పుడేదైతే అది? (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసులో పార్టీని విలీనం చేయడానికే కాదు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు లేరు. సోమవారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన తీరు గాని, ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన వైనం గానీ ఆ విషయాన్ని స్పష్టంగా పట్టిస్తోంది. కాంగ్రెసులో పార్టీని విలీనం చేసినా, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ మనుగడ సాగిస్తుందనే ఉద్దేశం ఆయనకు ఉంది. కాంగ్రెసుతో పోటీ పడడం ద్వారా తెలుగుదేశం పార్టీని పూర్తిగా దెబ్బ కొట్టవచ్చునని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకున్నా తామే ఆధిక్యత సాధిస్తామనే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే బిజెపి కూడా నష్టపోతుందనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. దానివల్ల కాంగ్రెసుకు, తమ పార్టీకి మధ్య మాత్రమే పోటీ ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ తనకు పూర్తిగా కలిసి వస్తుందని కూడా ఆయన అనుకుంటున్నారు.
విలీనమైతే కాంగ్రెసుకు చేజేతులా అధికారం కట్టబెట్టినట్లవుతుందని, కాంగ్రెసుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉండదని వాదించే వర్గం తెలంగాణలో బలంగానే ఉంది. దాంతో ఆ వర్గం ఒత్తిడి కూడా కెసిఆర్ మీద ఉంది. తాము వంద శాసనసభా స్థానాలను, 14 లోకసభ స్థానాలను గెలుచుకుంటామనే ధీమాను కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని పూర్తిగా తెలంగాణ ప్రాంతంలో దెబ్బ తీయాలనే వ్యూహం కూడా కెసిఆర్‌కు ఉన్నట్లు చెబుతున్నారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే, ఆ పార్టీకి ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. ఈ మాటలను బట్టి చూస్తే బిజెపి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే, ఎన్డియేలో చేరడానికి కూడా ఆయన సిద్ధపడే అవకాశాలున్నట్లు అర్థమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో సాన్నిహిత్యాన్ని పెంచుకుని రాష్ట్రంలో పనులు చేయించుకోవాలనే వ్యూహం కూడా ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీ నాయకుల ఒత్తిడి కూడా...
కాంగ్రెసులో విలీనం జరిగితే తమకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా లభిస్తుందో లేదో అనే అనుమానాలు తెరాసలోని మెజారిటీ నాయకులను పట్టిపీడిస్తోంది. దీంతో పార్టీ నాయకులు ఎక్కువ మంది విలీనానికి వ్యతిరేకంగా ఉన్నారు.

తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయడమే..
పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తే తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు జరిగే అవకాశం ఉండదని, కాంగ్రెసుకూ తమకు మధ్య పోటీ ఉంటుందనే ఉద్దేశంతో టిడిపి నాయకులు ఆ పార్టీలోనే కొనసాగే అవకాశాలుంటాయని కెసిఆర్ భావిస్తున్నారు. సత్యవతి రథాడ్, నగేష్ వంటి శాసనసభ్యులను ఆయన పార్టీలో చేర్చుకున్నారు. ఇటువంటి వలసలకు విలీనం వల్ల బ్రేక్ పడుతుందని ఆయన భావిస్తున్టన్లు చెబుతున్నారు.

విలీనానికి పార్టీ శ్రేణులు వ్యతిరేకమే..
నిజానికి, తెరాస శ్రేణులు కాంగ్రెసుతో విలీనం ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెసు నాయకులపై ప్రజలకు విశ్వాసం లేకపోవడాన్ని కూడా కెసిఆర్ వాడుకున్నారు.

బలం పెంచుకోవడమే కార్యాచరణ..
తెలుగుదేశం పార్టీ నుంచి వలసలను ఇతోధికంగా ప్రోత్సహించే విధానాన్ని కెసిఆర్ అనుసరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు తాజాగా పార్టీలోకి రాగా, సోమవారం నగేష్, సత్యవతి రాథోడ్ తెరాసలో చేరారు.

టిడిపియే టార్గెట్..
కెసిఆర్ ప్రస్తుతానికైతే కాంగ్రెసుపై పెద్దగా విమర్శలు ఎక్కుపెట్టకుండా తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకున్నారు. టిడిపికి తెలంగాణలో స్థానం లేకుండా చేయాలనేది ఆయన లక్ష్యం.

ఆప్షన్ ఓపెన్‌గా...
తెలంగాణలో మెజారిటీ లోకసభ స్థానాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న కెసిఆర్ కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థితిలో ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకే, కాంగ్రెసుకు పూర్తి స్థాయిలో నిబద్ధతను వ్యక్తం చేయడం లేదు.

కెసిఆర్‌కే తెలంగాణ పగ్గాలు..
తెలంగాణ రాష్ట్రంలో దళిత నేతనే తొలి ముఖ్యమంత్రి అవుతాడనే ప్రకటన నుంచి కూడా కెసిఆర్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. ఆ విషయాన్ని ఎన్నికలు ముగిసిన తర్వాత చూద్దామని అన్నారు.

అంతులేని ధీమా...
తెలంగాణలో మిగతా పార్టీలన్నీ నామమాత్రమవుతాయని, తమ పార్టీ మాత్రమే నిలుస్తుందని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. అదే అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెరాసలోకి వస్తున్నారు.

కేశవ రావును గెలిపించినా..
కాంగ్రెసు నుంచి వచ్చిన కేశవరావుకు కెసిఆర్ అధికంగానే ప్రాధాన్యం ఇస్తున్నారు. పొత్తులపై చర్చలకు కూడా ఆయన నేతృత్వంలో కమిటీ వేశారు. కాంగ్రెసు మద్దతుతో వ్యూహాత్మకంగా ఆయనను రాజ్యసభకు ఎంపిక చేయించుకున్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications