వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Array

By Staff
|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలోలైంగిక కారణాల వల్ల జరుగుతున్నహత్యలే ఎక్కువని పోలీసులు రికార్డులు సూచిస్తున్నాయి. మన రాష్ట్రంలోఅక్రమసంబంధాలు, సెక్స్‌ నేరాల సంఖ్యవిపరీతంగా పెరగడం ఆందోళనకలిగిస్తోంది. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్‌వరకు సెక్స్‌ సంబంధితకారణాల వల్ల 23 జిల్లాల్లో 179 హత్యలుజరిగాయి. రాష్ట్రంలో హత్యా కారణాలబ్రేకప్‌ ఈ విధంగా ఉంది. కుటుంబ వివాదాలవల్ల 171, నక్సలైట్ల హింస వల్ల 90, ఫ్యాక్షన్‌ కారణాలు 3, పాత కక్షలు 108,సెక్స్‌ సంబంధిత హత్యలు 179, చిల్లరతగాదాల వల్ల 120, భూ వివాదాల వల్ల 38, ఆస్తితగాదాలు ఘర్షణల వల్ల 29, వరకట్నహత్యలు 49, ఇతర అనేకానేక కారణాలవల్ల 369 హత్యలు జరిగినట్టు పోలీసు గణాంకాలుతెలియజేస్తున్నాయి. హత్యల్లో మహబూబ్‌నగర్‌జిల్లా, దొంగతనాల్లో నిజామాబాద్‌, దోపిడీల్లో సైబరాబాద్‌,హైదరాబాద్‌ కమిషనరేట్‌లుఅగ్రస్ధానంలో ఉన్నాయి.

వర్షాలతోవైఎస్‌ ఉబ్బి తబ్బిబ్బు

రాష్ట్రంలోకురుస్తున్న వర్షాలు ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డికి హర్షం కలిగిస్తున్నాయి. నిన్న కడప జిల్లాలోరాజీవ్‌ నగర బాట కార్యక్రమంలోఆయన అడుగడునా జల దేవత అయినగంగమ్మ తల్లికి ప్రణామం చేశారు.రాష్ట్రంలో కరువు పరిస్ధితులను పారదోలి, పాడిపంటల వృద్ధికితోడ్పడుతున్న గంగమ్మ తల్లికిపూజల చేయవలసిందిగా రాజశేఖరరెడ్డితన మంత్రివర్గ సహచరులకు సూచించారు. కడప జిల్లాలో పది గంటలవ్యవధిలో ఆయన 68 కార్యక్రమాల్లో పాల్గొని 68 కొబ్బరికాయలుకొట్టారు. తనసొంత జిల్లా అయినందున కడపనుతెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధికిదూరంగా ఉంచిందని, తాను కడపజిల్లాను ఇతర జిల్లాలతో సమానంగాఅభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు.

ఢిల్లీలోచక్రం తిప్పనున్న చంద్రబాబు

ఇంటగెలవకపోయినా రచ్చ గెలవాలని చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు.కేంద్రంలో మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు ఆయనప్రయత్నిస్తున్నారని వార్తలు ఎప్పటి నుంచోవస్తున్నాయి. కేంద్రంలో బిజెపి ఫ్రంట్‌కు, కాంగ్రెస్‌ఫ్రంట్‌కువ్యతిరేకంగా నేషనల్‌కాన్ఫరెన్స్‌, ఇండియన్‌ నేషనల్‌లోక్‌దళ్‌, బిజెడి, సమాజ్‌వాది పార్టీలతో ఒకప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలన్నది చంద్రబాబునాయుడు ఆకాంక్ష. జాతీయ స్ధాయిరాజకీయాలకు నాయకత్వంవహించవలసిందిగా చంద్రబాబు నాయుడిని శిరోమణి అకాలీదళ్‌అధ్యక్షుడు ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌కోరారు. చంద్రబాబు త్వరలో ఒమర్‌అబ్దుల్లా, ఓంప్రకాష్‌ చౌతాలా, నవీన్‌పట్నాయక్‌, ములాయం సింగ్‌ యాదవ్‌లతోచర్చలు జరపనున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు, పంజాబ్‌, అస్సాంఅసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడో ఫ్రంట్‌ఏర్పాటు ఒక కొలిక్కి వస్తుందని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X