హోంపేజి
హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నంలో కూడా రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. విశాఖ నగరం లోపల ఆరు నెలల క్రితం వెయ్యి చదరపు గజాల ఫ్లాట్ పది లక్షల రూపాయలు పలికేది. ఆరు నెలల్లోనే ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడా ఫ్లాట్ కొనాలంటే 20 లక్షల పైమాటే. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల భూముల ధరలు పెరగడం వల్ల నిరుపేద లంబాడీ కుటుంబాలు ఇప్పుడు కోట్ల రూపాయలను కళ్లజూస్తున్నాయి. ఆ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు వైజాగ్‌లో కూడా అదే పరిస్ధితి. విశాఖపట్నంలో దాదాపు 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడంలో ఇప్పుడు అక్కడ భూముల రేట్లు పట్టనలవి కాకుండా పెరిగిపోతున్నాయి. వైజాగ్‌లో సత్యం కంప్యూటర్స్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావచ్చింది. విప్రో తదితరల కంపెనీల భవనాలు కూడా నిర్మాణం కానున్నాయి. ప్రభుత్వ రంగసంస్ధలైన హిందుస్ధాన్ పెట్రోలియం కార్పొరేషన్ 20,000 కోట్లు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ 10,000 కోట్ల విస్తరణ పథకాలు చేపట్టడంతో నగరంలో ప్లాట్లు గరం గరంగా మారాయి.
విజయవాడలో మళ్ళీ కమ్మ, కాపు విభేదాలు
పూరీ జగన్నాధ్ చేతిలో చిరంజీవి కుమారుడి భవిత












Click it and Unblock the Notifications
