వెంకయ్యనాయుడికి చిరంజీవి ఫోన్?
దాసరి నారాయణ రావు, చిరంజీవిల మధ్య మైత్రికి శాశ్వతంగా తెరపడిందన్న విషయం శ్రీజ పెళ్ళి ఉదంతంలో స్పష్టమైంది. కేంద్రమంత్రి హోదాలో ఢిల్లీలో పలుకుబడీ వెలగబెడుతున్న దాసరికి చిరంజీవి తన కూతురు పెళ్ళి చేసుకుని ఢిల్లీ చేరిందన్న విషయం ఫోన్ చేసి చెప్పలేదు. తమ కుటుంబానికి అనుకూలంగా ఢిల్లీలో పావులు కదపమని కోరలేదు.
దాసరి కూడా చిరంజీవిని ఓదార్చడానికి ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదట. ఇలా ఉండగా శ్రీజ దంపతులు ఢిల్లీ చేరుకున్నారని తెలిసిన వెంటనే చిరంజీవి దాసరిని కాకుండా బిజెపి అగ్ర నాయకుడు వెంకయ్య నాయుడిని కోరినట్టు తెలుస్తోంది. వీరి కేసును ప్రముఖ పింకీ ఆనంద్ టేకప్ చేయకుండా చూడవలసిందిగా చిరంజీవి కోరగా, వెంకయ్య నాయుడు ఆ లాయర్ తో మాట్లాడారట.
అప్పటికే పాతిక లక్షల రూపాయల అడ్వాన్సు పుచ్చుకున్న పింకీ ఆనంద్ ఈ దశలో వెనక్కి వెళ్ళలేనని చెప్పినట్టు తెలిసింది. కాగా ఆ పాతిక లక్షల రూపాయలను శ్రీజ్, శిరీష్ ఎక్కడ పుట్టించారో, ఆ డబ్బు ఎవరు సమకూర్చారో అన్నది సినిమాటిక్ మిస్టరీలాగా ఉంది.












Click it and Unblock the Notifications