జగన్ సాక్షిగా "సాక్షి" కొత్తపుంతలు
వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ "సాక్షి" దినపత్రిక అట్టహాసంగా సంక్రాంతి నాడు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తాను సమర్ధులు అనుకున్న వారిని కీలక స్ధానాల్లో నియమించిన జగన్ కార్పొరేట్ శైలిలో తన పత్రికను నడపాలని యోచిస్తున్నారు.
"సాక్షి" పత్రిక లే అవుట్ డిజైన్ చేసే బాధ్యతను కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో ఒక ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ సంస్ధకు జగన్ అప్పగించినట్టు తెలిసింది. ఇటీవల "సాక్షి" సిబ్బందితో సమావేశమైన జగన్ ఆధునిక జర్నలిజం గురించి అనర్గళంగా ప్రసంగించడంతో ఎడిటర్ సహా సీనియర్ సిబ్బంది నోళ్ళు వెళ్ళబెట్టుకున్నారట.
జగన్ కు నచ్చేలా పత్రికను తీసుకురావడం నిజంగా కష్టమైన పనేనని గ్రహించిన సీనియర్లు ఇంకా బాగా కష్టపడుతున్నారట. ఈ విషయం తెలుసుకున్న "ఈనాడు", "ఆంధ్రజ్యోతి" యాజమాన్యాలు కొత్త ఆలోచనల కోసం అన్వేషిస్తున్నాయి. ఇటీవలి కాలంలో జర్నలిస్టులు కూడా అవినీతికి పాల్పడుతుండడం గ్రహించిన జగన్ " సాక్షి"లో అక్షరాల అవినీతి ఉండకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని ఆయన ఆ సమావేశంలో పాత్రికేయులకు చెప్పారు. అవసరమైతే మీ వ్యక్తిగత ఇబ్బందులు నాతో చెప్పుకోండి, అవినీతికి మాత్రం పాల్పడకండి అని జగన్ బాబు చెప్పడంతో జర్నలిస్టులు ఉలిక్కిపడ్డారు.












Click it and Unblock the Notifications