చిరు పార్టీ ఆఫీసులో సిసి కెమెరాలు?
జూబిలీహిల్స్ లోని చిరంజీవి పార్టీ కార్యాలయంలో హైటెక్ హంగులు ఉన్నాయి. ఇప్పటివరకు తెలుగుదేశం, టీఅర్ ఎస్ కార్యాలయాలు మాత్రమే హైటెక్ గా ఉండేవి. వాటిని తలదన్నేలా చిరంజీవి పార్టీ కార్యాలయాన్ని అల్లు అరవింద్ తీర్చిదిద్దారు. చిరంజీవి విలేకరులతోను, పార్టీ ముఖ్య నాయకులతోను మాట్లాడడానికి ఒక విశాలమైన చాంబర్ ను ఏర్పాటు చేశారు. కార్యాలయంలోని ప్రతి గదిలోను సిసి కెమెరాలను అమర్చారు. పార్టీలో చేరుతున్న ముఖ్య నాయకుల కదలికలను కనిపెట్టడానికి, కోవర్టులను వెళ్ళగొట్టడానికి ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
చిరంజీవి పార్టీ 210కి పైగా స్ధానాలతో అధికారంలోకి రావడం ఖాయమని, అయితే ముదురు రాజకీయ నాయకుల వెన్నుపోటుతో చిరు ముఖ్యమంత్రి పదవికి ఎసరు వస్తుందని కొందరు జ్యోతిష్యులు చెప్పారని, అందువల్ల అల్లు అరవింద్ ఈ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఇదంతా సినిమా ఫక్కీలోనే సాగుతోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications