ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెడ్డి తన నిజ జీవిత పాత్రతో ఓ చిత్రం రూపొందనున్నదని ఆ మథ్య వచ్చిన వార్తలు ఇప్పుడు కార్యరూపం దాల్చనున్నాయి. సి.సి.రెడ్డి నిర్మాతగా ఈ చిత్రాన్ని తమ విసు ఫిల్మ్ బ్యానర్ పై తీసే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే ఈ చిత్రంలో వచ్చే తన పాత్రని మూడు ధపాలలో పూర్తి చేయమని సీ.ఎం కోరినట్లు తెలుస్తోంది. 'తమ్ముడు' ఫేమ్ అరుణప్రసాద్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సబ్జెక్టు ముఖ్యంగా బ్రహ్మానందం పాత్ర చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అదీ మూకీ పాత్రని ఫిల్మ్ నగర్ వాసులు అనుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయాలను సెటైర్ చేస్తూ, ముఖ్యమంత్రిది అధ్బుత పాలన అంటూ ప్రచార చిత్రంగా అయ్యేటట్ల స్క్రిప్టు రూపొందిస్తున్నారుట. అందులో రాజీవ్ గృహకల్ప,ఇందిరమ్మ పథకం...వంటివి ప్రముఖంగా ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ఇక బ్రహ్మానందం ఆదివాసిగా కనిపిస్తారని ...గిరిజన తెగనుండి వచ్చిన అతను ముఖ్యమంత్రిని కలుసుకునే క్రమంలో సిటీ వస్తాడని ఈ డవలప్ మెంటు చూసి ఆశ్చర్యపోతాడని అనుకుంటున్నారు. కామిడీగా సాగే ఈ సినిమా కమర్షియల్ విజయంగా కాక కాంగ్రేస్ పార్టీ ప్రతిష్ఠను పెంచేలా,పార్టీ సిద్దాంతాలు,స్క్రీములు పట్ల ఎవేర్ నెస్ పెంచేలా ఉంటుందని తెలుస్తుంది. అందులో వై.యస్ పాత్ర పది నిముషాలు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. అలాగే మాటలు,పాటలు లేని హాస్య ప్రయోగంగా ఉండాలని స్క్రిప్టుపై కుస్తీ పడుతున్నారని వినికిడి. ఇది కనుక క్లిక్ అయితే మిగతా పార్టీలు వారు తమకు అనుకూలమైన దర్శక,నటులతో ఇలాంటి పార్టీ ప్రచార చిత్రాలు తీసే ట్రెండ్ ప్రారంభం కావచ్చు.